క్ష‌మాప‌ణ‌లు చెప్పిన త‌నికెళ్ల భ‌ర‌ణి.. ఎవ‌రికి చెప్పారంటే!

-

త‌నికెళ్ల భ‌ర‌ణి ఇప్ప‌టికే త‌న దైన న‌ట‌నా శైలిలో దూసుకుపోతున్నారు. ఈయ‌న‌తో పాటు ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన చాలా మంది న‌టులు ఇప్పుడు పెద్ద‌గా సినిమాలు చేయ‌ట్లేదు. కానీ భ‌ర‌ణి మాత్రం త‌న మేన‌రిజంతో ఇప్ప‌టికీ ప‌లు విల‌న్ పాత్ర‌ల్లో, లేదా హీరోకి తండ్రిగానో న‌టిస్తూ మెప్పిస్తున్నారు. ఏ పాత్ర‌లోనైనా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసిన‌ట్టు ఇమిడిపోవ‌డం ఆయ‌న ప్ర‌త్యేకత‌. ఆయ‌న న‌టుడిగానే కాకుండా ర‌చ‌యిత‌గా కూడా చాలా గుర్తింపు పొందారు.

ముఖ్యంగా ఆయ‌న శివ‌భ‌క్తుడు. తరచూ శివుడిపై కీర్తనలు, కవితలు, పాటలు రాస్తూ తన భక్తి పార‌వ‌శ్యాన్ని చూపిస్తుంటారు. ఆయన శివుడ్ని కొలుస్తూ రాసిన పాటలు కూడా బాగా పాపులర్ అయ్యాయి. ఇక్క‌డి వ‌ర‌కూ బాగానే ఉన్నా… ఇటీవల ఆయన ఫేస్ బుక్‌లో పోస్టు చేసిన ఓ పోస్టు తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. హేతువాదుల నుంచి విప‌రీత‌మైన వ్య‌తిరేకత వ‌చ్చింది.
ఆయ‌న చేసిన పోస్టులో ‘శబ్భాష్‌రా శంకరా’ అంటూ రాసుకొచ్చి.. ‘గప్పాల్ గొడ్తరు గాడిద‌ కొడుకులు.. నువ్వుండంగ లేవంటరు. అని రాశారు. అలాగే ఉన్నవో లేవో జెర చెవుల చెప్పిపోరా శబ్భాష్‌రా శంకరా!!’ అంటూ వ్యంగ్య పోస్టును పెట్టారు.దీనిపై హేతువాదులు ఆగ్ర‌హం తెలిపారు. ఒళ్లు బలిసిన వాళ్లే ఇలా రాస్తారంటూ సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారంట‌. దీంతో ఈరోజు ఉద‌యం ఆయ‌న వారంద‌రికీ క్ష‌మాప‌ణ‌లు చెప్తూ ఓ వీడియోను విడుద‌ల చేశారు. ఎవ‌రి మ‌న‌సు నొచ్చుకున్నా న‌న్ను క్ష‌మించండి అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. తను హేతువాదుల‌న్నా.. మాన‌వ‌తా వాదుల‌న్నా గౌర‌వం అంటూ వివ‌ర‌ణ ఇచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version