బాలీవుడ్ నటి తనుశ్రీ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈమె అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది. కాగా, ఈ చిన్నది ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ షోపై హాట్ కామెంట్స్ చేసింది. గత 11 సంవత్సరాల నుంచి బిగ్ బాస్ షో నిర్వాహకులు తనకు ఆఫర్ ఇస్తున్నప్పటికీ ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేస్తున్నానని తనుశ్రీ తెలిపారు. ఈ సంవత్సరం రూ. 1.65 కోట్ల ఆఫర్ ను రిజక్ట్ చేశానని తనుశ్రీ అన్నారు. రియాల్టీ షోలలో ఒకే బెడ్ పైన వేరే వ్యక్తితో నేను పడుకోలేనని హాట్ కామెంట్స్ చేశారు. నేను అంత చీప్ దాన్ని కాదు. అలాంటి ప్లేస్ లలో నేను అస్సలు ఉండలేను.

బిగ్ బాస్ షోలో స్త్రీలు, పురుషులు ఒకే బెడ్ పైన పడుకుంటారు. ఓకే హాల్లో కలిసి ఉంటారు. నేను అలాంటి దానిని కాదు. నాకు అలా ఉండడం అస్సలు నచ్చదని తనుశ్రీ దత్త సంచలన కామెంట్లు చేశారు. తనుశ్రీ దత్త చేసిన ఈ కామెంట్లపై బిగ్ బాస్ అభిమానులు మండిపడుతున్నారు. నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ ఇలా మాట్లాడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతోమంది బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. సినిమాలలో, సీరియల్స్ లో అవకాశాలను దక్కించుకున్నారు. అలాంటి రియాల్టీ షో గురించి ఇలా మాట్లాడడమేంటని అంటున్నారు.