రాబోయే రెండు గంటల్లో కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని IMD స్పష్టం చేసింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఆదిలాబాద్, జగిత్యాల, హనుమకొండ, భూపాలపల్లి, కరీంనగర్, జనగాం, ములుగు, మేడ్చల్, నిజామాబాద్, నిర్మల్, సిద్దిపేట, సిరిసిల్ల, వరంగల్, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో జల్లులతో కూడిన వర్షాలు కురవడం స్టార్ట్ అయ్యాయి. రెండు గంటల పాటు పెడతెరిపి లేకుండా వర్షాలు అధికంగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షంతో పాటు ఈదురు గాలులు బలంగా వేస్తాయని పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితులలో తప్పితే బయటకు రాకూడదని సూచనలు జారీ చేశారు. వృద్దులు, చిన్న పిల్లలు ఎట్టి పరిస్థితులలో బయటకు రాకూడదని పేర్కొన్నారు.