రాహుల్ గాంధీ థీమ్ ఒక్కటే అని దేశ సంపదను దోచుకోవడం అని విమర్శించారు తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉండగా 12 లక్షల కోట్లను లూటీ చేసిందని విమర్శించారు. రాహుల్ గాంధీ పొలిటికల్ టూరిస్ట్ అని… దేశ సంపదను దోచిన పార్టీ ఇంకా ఖతం అవ్వలేదని ఆయన విమర్శించారు. డ్రామాలు తప్పా రైతులు కష్టాలపై చింత లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ దేశానికి ఉపయోగపడే ట్వీట్ల కన్నా విదేశాలకు ఉపయోగపడే ట్వీట్లు చేస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ ఇతర దేశాాలు ఎలా పర్యటిస్తారో… తెలంగాణలో కూడా అదే విధంగా పర్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీ పొలిటికల్ టూరిస్ట్… దేశ సంపదను దోచుకోవడమే టార్గెట్: తరుణ్ చుగ్
-