టాటా అల్ట్రోజ్ వారి లగ్జరీ కారు కేవలం లక్ష రూపాయలకే అందుబాటులోకి రానుంది. ఎలా అంటే.. ఇటీవలే టాటా టర్బో పెట్రోల్ వెర్షన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇది మంచి అమ్మాకాలను కూడా కనబరుస్తోంది. ఈ కారు ఇప్పటికే మార్కెట్‌లో మంచి పోటీ కూడా ఇస్తోంది.
నయావెరైటీ
టాటా అల్ట్రోజ్ కారు మంచి డిజైన్‌తో ముందుకు వచ్చింది. టర్బో వెరియంట్ 1.2 లీటర్ 3 సిలిండర్ టర్బో చార్జ్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 108 బీహెచ్‌పీ పవర్, 140 ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి చేస్తోంది. కారులో రెండు ముందు చక్రాలు 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ బదిలీ కలిగి ఉంది. అంతే కాకుండా ఈ కారు డ్యూయల్ క్లచ్ ఆటోమెటిక్ షోలో టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో అల్ట్రోజ్ మంచి రివ్యూస్ సాధించడం చెప్పుకోతగ్గ విషయం. నాటి నుంచి కారు కొనడానికి సిద్ధంగా ఉన్న అభిమానులు ఈ కారు కోసం ఎప్పుడు మార్కెట్లోకి అడుగు పెడుతుందా? అని ఎదురు చూస్తున్నారు. శక్తిమంతమైన ఇంజిన్లతో కూడిన అల్ట్రోజ్ ఈ విభాగంలో ప్రత్యర్థులకు గట్టి పోటీని ఇవ్వనుంది.
అల్ట్రోజ్ 1.2 లీటర్, 3– సిలిండర్ సాధారణంగా ఆశించిన పెట్రోల్, 1.5 లీటర్, 4 సిలిండర్ టర్బోచార్జ్ డీజిల్ ఇంజిన్ ఎంపికలోకి వస్తోంది. పెట్రోల్ ఇంజిన్ 85 బీహెచ్‌పీ శక్తి, 113 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. అదే సమయంలో డీజిల్ ఇంజిన్ 89 బీహెచ్‌పీ శక్తిని, 200 ఎన్‌ఎం టార్కు ను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజిన్లు 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేస్తున్నారు. టాటా అల్ట్రోజ్ 5 వెరియంట్లు మారుతి బెలోనో, ఐ20 వంటి కార్లకు గట్టి పోటీని ఇస్తోంది. వీటిలో ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎం, ఎక్స్‌టీ, ఎక్స్‌జెడ్, ఎక్స్‌జెడ్(ఓ) ఉన్నాయి.
ధర ఎంతంటే?
టాటా అల్ట్రోజ్ ధర విషయానికి వస్తే హైదరాబాద్‌లో ఎక్స్ షోరూం ధర 5.44 లక్షలు. అయితే ఆన్ రోడ్ ధర మరో లక్ష రూపాయల వరకు పెరిగే వీలుంది. దీంతో ఈ కారు ఆన్‌రోడ్ ధర సుమారుగా 6.44 లక్షలకు వస్తుంది. ఇక ఈ కారుకు ఈఎంఐ పద్ధతిలో కొనాలనుకుంటే మాత్రం మినిమం డౌన్‌పేమెంట్ 1 లక్ష వరకు ఉండే చాన్స్ ఉంది. గరిష్టంగా కారులోన్ వడ్డీ రేటు 9.2 శాతంగా నిర్ణయించుకున్నా.. నెలకు రూ.10 వేలకు పైగా దాదాపు 5 సంవత్సరాల పాటు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.