పార్లెమెంటు నూతన భవన నిర్మాణ పనుల బాధ్యతలని టాటా గ్రూపు ప్రాజెక్ట్స్ దక్కించుకుంది. ఈ మేరకు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ వేలం పాటకి పిలవగా టాటా గ్రూపు 861.90 కోట్లు కోట్ చేయగా, ఆ ప్రాజెక్టు టాటా గ్రూప్ వశమైంది. ఐతే మరో నిర్మాణ కంపెనీ లార్సెన్ అండ్ టూబ్రో 865కోట్ల రూపాయలు కోట్ చేసింది. వర్షాకాల సమావేశాలు ముగిసిన అనంతరం పార్లమెంటు భవన నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయట.
2022 ఆగస్టు 15వ తేదీ 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే సమయానికి ఈ భవన నిర్మాణం పూర్తి అవుతుందట. 900 నుండి 1200మంది కూర్చునే లాగా త్రిభుజాకారంగా నిర్మించనున్నారట. పార్లమెంట్ సమావేశాలు జరిగే భవనంతో పాటు ఉమ్మడి కేంద్ర సచివాలయ నిర్మాణం జరుగుతుందట. 2024వరకు ఈ సచివాలయం పూర్తవుతుందట.