ఇలా చేస్తే రూ.46 వేలు ఆదా చేసుకోవచ్చు..!

-

ఉద్యోగం చేస్తున్నారా…? అయితే మీకు ఇది మంచి విషయం అనే చెప్పాలి. పన్ను చెల్లిస్తారు కనుక తప్పక మీరు ఈ విషయం తెలుసుకోవాలి. దీనితో మీరు మీ డబ్బులని కూడా ఆదా చేసుకోవచ్చు. ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌ లో డబ్బులు పెడితే పన్ను ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ పని చెయ్యడానికి మీరు ఎక్కడకి వెళ్ళక్కర్లేదు. కేవలం మీ ఇంట్లో నుంచి అయినా ఆఫీసు నుంచి అయినా దేనిని చెయ్యొచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే… మీరు ఇన్వెస్ట్‌మెంట్ ప్రూఫ్స్‌ను మీ కంపెనీకి అందిస్తున్నారు కదా..! అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి.

మ్యూచువల్ ఫండ్స్ ‌లో మీరు కనుక డబ్బులు పెడితే ఏకంగా దీని వల్ల రూ.46,800 వరకు ఆదా చేసుకోవచ్చు. ఎంత మంచి వార్తో కదా..! ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెడితేనే ఈ బెనిఫిట్ ఉంటుంది. డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ ఫోన్‌పే ఆన్‌లైన్‌లోనే ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెట్టేందుకు అవకాశం ఇచ్చింది. మీరు ఎక్కడికీ వెళ్లకుండానే ఇంట్లో నుంచే ఈ పని చేసేయొచ్చు. ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే..? మూడేళ్ల పాటు మీ డబ్బులను వెనక్కి తీసుకోలేరు. అప్పుడు ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌కు లాకిన్ పీరియడ్ మూడేళ్లు ఉంటుంది అందుకే. అయితే వీటిల్లో డబ్బులు పెడితే బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు FD కన్నా ఎక్కువ రాబడి మీకు లభిస్తుంది గమనించండి.

యాక్సిస్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్, డీఎస్‌పీ, టాటా, SBI, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ తో ఫోన్‌పే జతకట్టిన సంగతి తెలిసినదే. అయితే మీరు ఈ సంస్థలు అందించే ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెట్టొచ్చు. దీని మూలంగా మీకు రెండు లాభాలున్నాయి. ఫోన్‌పే యాప్‌లోకి వెళ్లాలి. మై మనీ ఆప్షన్ ‌లోకి వెళ్లాలి. ఇన్వెస్ట్‌మెంట్స్ కేటగిరిలో హై గ్రోత్ ప్రొడక్ట్స్ కింద ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ ఉంటాయి. ఇలా చేసాక నచ్చిన ఫండ్ ఎంచుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ట్యాక్సబుల్ ఇన్‌కమ్ రూ.10 లక్షలకు పైన రూ.50 లక్షలకు లోపు ఉన్న వారు (30 శాతం ట్యాక్స్ బ్రాకెట్‌లో ఉన్న వారు) రూ.46 వేలు ఆదా చేసుకోవచ్చు. ఇలా చేసి పన్ను ఆదాతో పాటు అదిరే రాబడి సొంతం చేసుకోవచ్చు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version