టీడీపీ తొలి జాబితాలో నర్సీపట్నం పాయకరావుపేట నియోజకవర్గం నుండి సీనియర్ నాయకులు అయ్యన్నపాత్రుడు రాష్ట్ర మహిళా నాయకురాలు వంగలపూడి అనిత చోటును దక్కించుకున్నారు. మాజీ మంత్రి అయినపాత్రుడు సీటు ముందే ఊహించినట్లు ఖరారైంది జిల్లాలో రిజర్వుడు నియోజకవర్గ కాకుండా మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో అయ్యన్న అభ్యర్థిత్వం ఒక్కటే ఖరారు కావడం విశేషం అనకాపల్లి ఎంపీగా అయ్యన్న తనయుడు పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారు. టిడిపి జనసేన పొత్తులో భాగంగా అనకాపల్లి టీడీపీ కి కేటాయించిన పక్షంలో నర్సీపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.
ఎంపీ విషయం ఖరారు కాకుండానే నర్సీపట్నం నుండి అయ్యన్నపాత్రుని ప్రకటించారు ఇక విజయ్ కి అవకాశం లేనట్లు తెలుస్తోంది. పాయకరావుపేట విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే పార్టీ ఇంచార్జ్ అనిత ఇది వరకు కొవ్వూరు నుండి పోటీ చేసి ఓడిపోయారు ఏదేమైనా అనితని ఫిక్స్ చేశారు. అలానే ఇప్పుడు అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ పేరు వచ్చింది. పరుచూరి భాస్కరరావుని పక్కన పెట్టి కొణతాలను ఫిక్స్ చేశారు.