టీడీపీ ఎమ్మెల్యే గోరంట్లకు షాక్‌..రాజమండ్రి రూరల్ టికెట్ గల్లంతు ?

-

ఇవాళ మధ్యాహ్నం రాజమండ్రి రానున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజమండ్రిలోని జనసేన పార్లమెంటరీ కార్యాలయంలో పవన్ ఎన్నికల సమావేశం ఉంటుంది. నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు, ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు పవన్ కళ్యాణ్. విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి ఎయిర్ పోర్ట్ చేరుకోనున్న పవన్ కళ్యాణ్….ఇప్పటికే రాజానగరం నుంచి జనసేన బరిలో ఉంటుందని ప్రకటన చేశారు.

TDP and Janasena fight over Rajahmundry Rural seat

ఇక ఇవాళ పవన్ కళ్యాణ్ సమావేశం నేపథ్యంలో రాజమండ్రి రూరల్ టికెట్ పై ఉత్కంఠ నెలకొంది. టికెట్ నాది అంటూ నాది అంటూ టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల, జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ల ప్రకటనలు చేసుకుంటున్నారు. ఇవాళ పవన్ పర్యటనలో రాజమండ్రి రూరల్ టికెట్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. భారీ ర్యాలీతో పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ కు స్వాగతం పలికేందుకు నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే…రాజమండ్రి రూరల్ టికెట్ టిడిపి ఎమ్మెల్యే గోరంట్లకు రాదని..జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ కు వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version