తమ్ముళ్లు హ్యాపీ: లోకేష్ కు తెరుచుకున్నట్లున్నాయి… తెలుసుకున్నారంట!

-

అధికారంలో ఉన్నప్పుడు… అధికార గర్వంతోనో, అవగాహనారాహిత్యంతోనో, ఆ అధికారం శాస్వతం కాదన్న వాస్తవాన్ని గ్రహించలేకో కానీ… కొందరికి కళ్లు మూసుకుపోతుంటాయి! నాయకులు ఉన్నది ప్రజలకోసం.. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి రాజకీయాల్లోకి రావడం కాదు, దానికి పేపర్ చదివితే సరిపోతుంది… ప్రజల కష్టాలు తెలుసుకుని, వాటిని పరిష్కరించడానికి రాజకీయాల్లోకి రావాలి! ఆ ఉపోద్ఘాతం సంగతి కాసేపు పక్కనపెడితే… తాజాగా కరోనా వేల లోకేష్ కు కళ్లు తెరుచుకున్నాయి.. కార్మికుల కష్టాలు తెలిశాయి! ఈ మాటలు కాస్త అటు ఇటుగా అన్నది మరెవరో కాదు… లేకేషే!!

అవును… జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలందరికీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం.. కరోనా కారణంగా అమ్మాల్సిన సరకు చేనేతల వద్దే ఆగిపోయిందని బాదపడిన లోకేష్… నేతన్నల దగ్గరున్న స్టాక్‌ను వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు! అంతవరకూ బాగానే ఉంది కానీ… అనంతరం ఒక మంచి మాట మాట్లాడారు చినబాబు!

“లాక్ డౌన్ సమయంలో మంగళగిరి చేనేత కుటుంబాల కష్టాలు స్వయంగా తెలుసుకున్నాను. ఇక్కడి మంగళగిరి చీర “భారత చేనేత బ్రాండ్‌”గా ఎంపికైంది. అలాంటి నేతన్న కష్టాలలో ఉడతా సాయంగా బియ్యం, కూరగాయలు పంపిణీ చేయించాను.” అని అన్నారు! సరిగ్గా ఇక్కడే నెటిజన్లు బ్రయిన్ కి పనిచెప్పారు. మంగళగిరిలోన్నేకాదు… రాష్ట్రం మొత్తంలో కూడా నేతన్నల కష్టాలు చాలానే ఉన్నాయి. పైగా అవి ఈనాటివి కాదు. గతంలో తమరు మంత్రిగా ఉన్నప్పుడు, “బాబు” ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ తెలుసుకుని ఉంటే.. నేడు “మందలగిరి” అనే పరిస్థితి వచ్చేది కాదు, మంగళిగిరిలో ఓటమి కౌగిలిలో చేరేవారూ కాదు!

సరేలే… చేనేత కుటుంబాలు ఎన్నో కష్టాలు పడుతున్నాయని.. అందుకే జగన్, నేతన్నల కుటుంబాలకు ప్రత్యేక ఆర్ధిక సాయం అందిస్తున్నారని.. ఆ పనులు తాము అధికారంలో ఉన్నప్పుడు చేయకే ఈ పరిస్థితికి దిగజారామని ఇప్పటికైనా మా చినబాబుకు తెలిసిందని తమ్ముళ్లు హ్యాపీ ఫీలవుతున్నారంట!!

Read more RELATED
Recommended to you

Exit mobile version