టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీనియర్ నేతల విషయంలో కాస్త సీరియస్ గానే ఉన్నట్టుగా ఈ మధ్యకాలంలో కనబడుతోంది. పార్టీలో అగ్రనేతలు చాలామంది మున్సిపల్ ఎన్నికల్లో కష్టపడలేదు. విజయవాడలో ఉన్న వర్గ విభేదాలను పరిష్కరించుకోవాలని చెప్పినా కూడా చాలా మంది నేతలు ముందుకు రాలేదు. దీని కారణంగా పార్టీ సంస్థాగతంగా తీవ్రస్థాయిలో నష్టాలు ఎదుర్కొంది.
మున్సిపల్ ఎన్నికల్లో చాలా మంది స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేసే నియోజకవర్గాల ఇన్చార్జిలు కూడా కనపడలేదు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో సీనియర్ నాయకులు చాలామంది బయటకు రాలేదు. కృష్ణా జిల్లా నాయకత్వం బలంగా ఉన్నా వాళ్ళు ఎవరూ కూడా పార్టీ కోసం పని చేయలేదు. దీంతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ కోల్పోయింది.
దీంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు విజయవాడ లో కొన్ని కీలక మార్పులు కూడా చేయవచ్చని అంటున్నారు. పార్టీలో నుంచి కొంతమంది నేతలు బయటకు వెళ్ళిపోయి అవకాశం ఉంది అంటూ ఈ మధ్య కాలంలో వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఆయా నేతలను బయటకు పంపించే ఆలోచనలో కూడా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాస్త ఆగ్రహంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది.
కొంత మంది నేతలను కలుపుకుని వెళ్లే విషయంలో కేసినేని నానీ ఘోరంగా విఫలమయ్యారని తాను ఎంపీని అనే ఇగో ఆయనలో ఎక్కువగా కనపడింది అని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు కేసినేని నానీతో కూడా ఒకసారి మాట్లాడి పలు సూచనలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయని టిడిపి వర్గాలు అంటున్నాయి.