టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో నేడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటించనునున్నారు. చంద్రబాబు నాయుడు రాక సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. నగరంలో గురువారం ఉదయం 10 గంటలకు కమ్మ సంఘం కల్యాణ మండపంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరవుతారని తెదేపా కర్నూలు, నంద్యాల పార్లమెంట్ నియోకవర్గాల అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి, పాణ్యం తెదేపా బాధ్యురాలు గౌరు చరితారెడ్డి తెలిపారు. ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ విస్తృత స్థాయి సమావేశం అనంతరం డోన్‌కు వెళ్లనున్నారు.
డోన్ నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో పట్టణంతో పాటు జలదుర్గంలో భారీ ఏర్పాట్లు చేశారు. గురువారం సాయంత్రం 4.50 గంటలకు డోన్ కు చేరుకుంటారు.. ఐటీఐ కళాశాల ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం రోడో ప్రారంభం అవుతుందని నియోజకవర్గ ఇన్ఛార్జి ధర్మవరం సుబ్బారెడ్డి తెలిపారు. డోన్ నుంచి కోట్లవారిపల్లె, గోసానిపల్లె, చింతలపేట, కొచ్చెర్వు మీదుగా జలదుర్గానికి వెళ్తారన్నారు. అక్కడ నిర్వహించే బహిరంగసభలో ప్రసంగిస్తారన్నారు. సభకు వచ్చే నాయకులు, కార్యకర్తలకు భోజన వసతి ఏర్పాట్లు చేశామన్నారు. ముఖ్యమైన నాయకులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాహనాల పార్కింగ్ సౌకర్యం కల్పించామన్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ రామలింగమయ్య తెలిపారు.