శ్మశానంలో వైసీపీ ఎమ్మెల్యే గెలవడమా ? ఇదేంటి ఈ హెడ్డింగ్ చాలా ట్విస్టింగ్‌గా ఉందే ? శ్మశానం ఏంటి ? వైసీపీ ఎమ్మెల్యే గెలవడం ఏంటి ? అని ఆశ్చర్యపోతున్నారా ? ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి పలువురు మంత్రులతో పాటు ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు టీడీపీపై ఏ రేంజ్‌లో విమర్శలు చేస్తున్నారో తెలిసిందే.
ఇక వైసీపీపై టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ ఉంటారు. తాజాగా ఈ రోజు కేశినేని భవన్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బుద్ధా వెంకన్న అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రతి ప్రతి ఒక్కరికి ఆదర్శమని కొనియాడారు. ప్రతి ఒక్కరికీ ప్రాధమిక హక్కులు ఉండాలని కోరుకున్న వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు.
ఈ క్రమంలోనే రాజధానిపై తరచూ విమర్శలు చేస్తోన్న మంత్రి బొత్స సత్యనారాయణకు వెంకన్న ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మంత్రి బొత్స అమరావతిని శ్మశానం అంటున్నారని… శ్మశానంలో వైసీపీ ఎమ్మెల్యే ఎలా ? గెలిచిందని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో ఉన్న రెండు అసెంబ్లీ స్థానాలు అయిన మంగళగిరి, తాడికొండలో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే వెంకన్న మాట్లాడుతూ ఎక్కడైనా కేబినెట్ సమావేశం శ్మశానంలో జరుపుతున్నారా? అని నిలదీశారు. బొత్స వ్యాఖ్యలు చూస్తుంటే అమరావతిని మాత్రమే కాదని… ఏపీనే శ్మశానంలా మారుస్తున్నారని బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు.