తూర్పు టీడీపీలో ట్విస్ట్‌లు..అసలు ఏం జరుగుతోంది?

-

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడుప్పుడే అక్కడ పార్టీ బలపడుతుంది ఈ తరుణంలో కొన్ని అంశాలు పార్టీకి ఇబ్బందిగా మారాయి. అది కూడా చంద్రబాబు జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో టి‌డి‌పిలో కలహాలు బయటపడుతున్నాయి. ఈ నెల 15న బాబు జిల్లా పర్యటనకు వస్తున్నారు. అయితే 16వ తేదీన జిల్లాకు చెందిన రాజేష్ మహాసేన టి‌డి‌పిలో చేరనున్నారు.

మొదట జనసేనలో చేరదామని అనుకున్న రాజేష్.. ఆ పార్టీ నుంచి ఆహ్వానం రాకపోవడంతో టి‌డి‌పి వైపుకు వచ్చారు. టీడీపీ పెద్దలు రాజేష్‌ని టీడీపీలో ఆహ్వానించారు. దీంతో ఆయన టి‌డి‌పిలో చేరడం ఖాయమైంది. కానీ తూర్పులోని టి‌డి‌పి దళిత నేతలు మాత్రం రాజేష్‌ని పార్టీలోకి తీసుకోవద్దని, తీసుకుంటే తాము పార్టీకి రాజీనామా చేస్తామని అంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి పనిచేసి..తర్వాత ఆ పార్టీకి దూరం జరిగి..మధ్యలో జనసేనలోకి వెళ్దామని అనుకుని..ఇప్పుడు టి‌డి‌పి‌లోకి వస్తున్నారని, ఏదో ఆశించే రాజేష్ టి‌డి‌పిలోకి వస్తున్నారని అంటున్నారు. ఆయన్ని పార్టీలో చేర్చుకోవద్దని అంటున్నారు.

ఇదిలా ఉంటే పెద్దాపురంలో బాబు సభ ఉంది..అక్కడ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు వ్యతిరేకంగా కొందరు తమ్ముళ్ళు గళం విప్పుతున్నారు. కొన్ని అక్రమాల విషయంలో రాజప్ప..వైసీపీతో కుమ్మక్కు అయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఈ సారి పెద్దాపురం సీటు కమ్మ నేతకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇటు కాకినాడ రూరల్ సీటు కోసం పిల్లి అనంతలక్ష్మీ ప్రయత్నిస్తున్నారు. కానీ ఆమెని టి‌డి‌పి సైడ్ చేసేలా ఉంది. ఆ సీటుని పేరాబత్తుల రాజశేఖర్‌కు ఇస్తారని తెలుస్తోంది. 2014లో గెలిచిన అనంతలక్ష్మీ..2019లో ఓడిపోయారు. తర్వాత తన భర్తతో కలిసి పార్టీని వీడి..మళ్ళీ పార్టీలోకి వచ్చి పనిచేస్తున్నారు. ఇప్పుడు సీటు కోసం ట్రై చేస్తున్నారు. కానీ బాబు మాత్రం రాజశేఖర్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. మొత్తానికి తూర్పు టి‌డి‌పిలో ట్విస్ట్‌లు నడుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version