సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. అందులో కొన్ని వైరల్ అయితే మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది ఏంటండీ.. కొబ్బరి బోండాలకు సమందించినది.. జ్యూస్‌లు, షేక్స్, స్మూతీస్ లాంటివి ఈ రోజుల్లో చాలా ఫేమస్. పైగా ఎక్కడ పడితే అక్కడ సులువుగా దొరికిపోతున్నాయి. అయితే చాలా మంది కొబ్బరి బోండాలను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు..అదేవిధంగా కొబ్బరి నీళ్లలో మరోకటి కలపడం అనేది నిజంగా వింతగానే చెప్పాలి. అయితే, ముఖ్యంగా మన దేశ ప్రజలందరూ ఇష్టపడే పానీయాలలో కొబ్బరి నీళ్లు ఒకటి. సాంప్రదాయకంగా మనం కొబ్బరి నీళ్లను చల్లదనానికి ఉత్తమమైన నీరుగా, ఆరోగ్యకరమైన దాహాన్ని తీర్చేదిగా పరిగణిస్తాము.. వీధి మార్కెట్లలో కొబ్బరి బోండాలకు గిరాకీ మరీంత ఎక్కువగా ఉంటుంది..
అదే విధంగా ఇప్పుడు వేసవి రానుంది.. దాంతో వీటికి డిమాండ్ కూడా భారీగా పెరుగుతూ వస్తుంది.అయితే, మీరెప్పుడైనా కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలిపి తాగడం చూశారా..? లేదు కదా..? ఇదిగో ఇక్కడ ట్విట్టర్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఒక రోడ్‌సైడ్ స్టాల్స్‌లో ఇలాంటి వెరైటీ కొబ్బరి నీళ్లను అమ్ముతున్నారు.కొబ్బరి బోండాంలో నిమ్మరసాన్ని కలుపుతూ దిగిన ఓ ఫొటోను తన మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేశాడు. ఆ ఫొటోకు ‘ఇది ఇంత పాపులర్ కాంబినేషన్ అని నాకు ఇప్పటిదాకా తెలియదు’ అంటూ ఇంగ్లిష్‌లో క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఈ ఫొటో ప్రస్తుతం ట్విటర్‌లో వైరల్‌గా మారింది..
ఇది కాస్త నెట్టింట చక్కర్లు కొడుతుంది..సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఫోటోపై చాలా మంది నెటిజన్లు స్పందించారు. కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగటం ఇదే తొలిసారిగా చూస్తున్నామంటూ నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు దీనిపై పెద్ద చర్చే జరిగింది. చాలా టేస్టీగా ఉంటుందని, ఇంకా ఏం జోడించవచ్చని చాలా మంది తమ ఐడియాలను షేర్ చేసుకుంటున్నారు. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మంగళూరులో దీన్ని బోంబా లైమ్ అంటారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.. మొత్తానికి కాస్త ట్రెండ్ అవుతుంది..
https://twitter.com/ArunDev1/status/1624265671868809218?t=75jF6j5hfWUmQHiQqpr92g&s=19