టీడీపీలో ఆ యువనేత దూకుడు… ఆ ప‌ద‌వే టార్గెట్టా…!

-

ప్రతిపక్ష టీడీపీలో మెల్ల మెల్లగా యువనేతల దూకుడు పెరుగుతుంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత కాస్త సైలెంట్ అయినా, ఇప్పుడు మాత్రం బాగానే యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. అధికార పార్టీ నేతలు ఎలాంటి విమర్శలు చేసినా వాటికి కౌంటర్లు ఇవ్వడంలో ముందుంటున్నారు. ముఖ్యంగా మంత్రి కొడాలి నాని మాట్లాడే బూతులకు ఇంతవరకు టీడీపీ నుంచి ఎవరు పెద్దగా కౌంటర్లు ఇవ్వలేకపోయారు. కానీ టీడీపీ యువనాయకుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరీ మాత్రం ఓ రేంజ్‌లో కొడాలికి కౌంటర్లు ఇచ్చారు. ఇటీవల కొడాలి నాని…చంద్రబాబు, దేవినేని ఉమాలపై తిట్ల వర్షం కురిపించారు. ఇక నానికి తగ్గట్టుగానే బ్రహ్మం కూడా స్ట్రాంగ్‌గానే మాట్లాడారు. కాస్త పరుష పదజాలం వాడుతూనే నానిపై విరుచుకుపడ్డారు.

కేవలం నాని విషయమనే కాదు..వల్లభనేని వంశీ, వసంత కృష్ణప్రసాద్‌లని సైతం ఏకీపారేస్తున్నారు. అలాగే పార్టీలో తిరుగుతూ నిత్యం వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. అమరావతి ఉద్యమంలో యాక్టివ్‌గా ఉంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల అక్రమాలు చేస్తున్నారని చెప్పి, బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అయితే టీడీపీలో మిగతా యువ నేతలకంటే బ్రహ్మం ఇంత దూకుడుగా ఉండటానికి కారణం లేకపోలేదు.టీడీపీలో ఖాళీ ఉన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కించుకోవడం కోసం బ్రహ్మం ఇంత దూకుడు ప్రదర్శిస్తున్నారని తెలిసిందే.

బ్రహ్మం మొన్నటి వరకూ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడుగా పనిచేశారు. అయితే ఆ పదవిని ఇటీవల విశాఖకు చెందిన ఓ యువనేతకు ఇచ్చారు. దీంతో తనకు తెలుగు యువత వస్తుందని బ్రహ్మం ఆశతో ఉన్నారు. ఓ సంవత్సరం ముందు వరకు ఈ పదవిలో దేవినేని అవినాష్ ఉన్న విషయం తెలిసిందే. తెలుగు యువత అధ్యక్షుడుగా అవినాష్ అద్భుతమైన పనితీరు కనబర్చారు. అయితే కొందరు సీనియర్లు అడ్డుపడటంతో దూకుడుగా తగ్గించేసి అవినాష్ వైసీపీలోకి వెళ్ళిపోయారు. అవినాష్ వెళ్ళాక మరో నేతకు ఆ పదవి ఇవ్వలేదు. దీంతో ఆ పదవిని దక్కించుకునేందుకు బ్రహ్మం బాగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. లోకేష్‌తో సన్నిహితంగా ఉండే తనకే ఆ పదవి వస్తుందని బ్రహ్మం ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Exit mobile version