చాలా మంది పురుషులు పొరపాటు చేస్తున్నారా..? నిలబడి పురుషులు మూత్ర విసర్జన చేయడం వలన ఇన్ని నష్టాలు ఉంటాయా..? తాజాగా నెట్టింట ఒక వీడియో వైరల్ అవుతోంది. ఒక పురుషుడు నిలబడి మూత్ర విసర్జన చేయడం వలన అనేక రకాల వ్యాధులకి కారణం అవుతుందని అర్ధమవుతోంది. ఇప్పటికే ఈ వీడియోని చాలా మంది చూశారు. ఈ వీడియోలో క్లుప్తంగా పురుషులు మూత్ర విసర్జన చేసినప్పుడు కలిగే హానికరమైన ఇన్ఫెక్షన్స్ గురించి వివరించారు.
పురుషులు నిలబడి మూత్రవిసర్జన చేయడం వలన ఇబ్బందులు వస్తాయని.. అలా చేయకపోవడం వలన హానికరమైన ఇన్ఫెక్షన్స్ కి దూరంగా ఉండొచ్చు అని ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే ఈ వీడియోలో అన్ హైజినిక్ కండిషన్స్ గురించి మాట్లాడారు. టాయిలెట్ బౌల్ లో మూత్ర విసర్జన చేసినప్పుడు యూరిన్ బయటికి పడిపోతుంది.
An explanation on why men shouldn’t pee while standing.
— YabaLeftOnline (@yabaleftonline) September 17, 2024
దీని కారణంగా బ్యాక్టీరియా, క్రిములు వంటివి స్ప్రెడ్ అవుతాయి. వాష్ రూమ్ లో ఉన్న టూత్ బ్రష్, టాయిలెట్ రోల్, టిష్యూ పేపర్ ఇలా పక్కన ఉన్న సామాన్ల మీద కూడా యూరిన్ పడిపోతుంది. దీనివలన అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయని వీడియోలో చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియోని విపరీతంగా షేర్ చేస్తున్నారు. చాలామంది ఇప్పటికే ఈ వీడియో ని చూశారు మరి వైరల్ వీడియో పై మీరూ ఒక లుక్ వేసేయండి.