వర్మా ఏపీ మీద సినిమా తీయ్.. జగన్ గా నేను నటిస్తానంటున్న టీడీపీ నేత

-

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మని ఏపీ మీద సినిమా చేయాలని టీడీపీ సీనియర్ నేత బండారు సత్య నారాయణ మూర్తి  రిక్వెస్టు చేశారు. ఏపిలో భారీ ఎత్తున జరుగుతున్న ఇళ్ల స్థలాల అవినీతి పై వర్మ సినిమా తీయాలని ఆయన కోరారు. ఆ సినిమా కు…అలా వైఎస్ అవినీతి పురం పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

నేను నటుడినే.. ఆ సినిమాలో  నటిస్తాను, ముఖ్యమంత్రి జగన్ పాత్ర పోషిస్తానని కూడా ఆయన ఆఫర్ ఇచ్చారు. ఎందుకంటే నేను జగన్ ని బాగా స్టడీ చేసానన్న ఆయన ఆయన చేసిన అవినీతి నాకు బాగా తెలుసు..అందుకే ఆ పాత్ర పోషించాలని అనుకుంటున్నానని అన్నారు. వర్మ అవకాశం ఇస్తే..తప్పకుండా నటిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version