తణుకు మాజీ ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు అమరావతే రాజధాని అన్న జగన్.. అధికారం లోకి వచ్చాక మటమార్చాడు మడమ తిప్పాడని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంలో అనేకమంది రైతులు వేల ఎకరాలు రాజధాని కోసం ఇచ్చారు అనేక కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి వచ్చారని వివరించారు. పారిశ్రామిక వేత్తలు అందరూ వెనుదిరిగారు.. రైతుల పరిస్థితి అధోగతి పాలు అయ్యిందని అన్నారు.
జగన్ పరిపాలన చూస్తే తుగ్లక్ పరిపాలన చూస్తున్నట్లు ఉందని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు.. ఎక్కడ చూసినా జె టాక్స్ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. రోడ్లు పరిస్థితి దారుణంగా ఉంది. స్విమ్మింగ్ పూల్స్ ను తలపిస్తున్నాయని అన్నారు. రాజధాని పేరుతో కులాల మధ్య , ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ, జగన్ కేసుల నుండి తప్పిచుకోవాలని చూస్తున్నాడన్నారు. అమరావతి అనేది ఏ ఒక్కరికీ సంబంధించినది కాదు ..అందరికి ఉపయోగపడేదని పేర్కొన్నారు. ఈ 16 నెలల పరిపాలనలో నవరత్నాలు పేరుతో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసారని విమర్శించారు.