జగన్ ని పిలిపించి చివాట్లు పెట్టిన మోడీ…!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ౦ కోసమే జగన్ ఢిల్లీ వెళ్ళారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు అని అబద్దం చెప్తున్నారని, కేవలం ఆయన వెళ్ళింది తన సొంత ప్రయోజనాల కోసమే అని పలువురు అంటున్నారు. ఇక ఈ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేసారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. ఏడు సార్లు ప్రధాని, కేంద్ర హోంమంత్రిని జగన్‌ కలిశారని, కేంద్రం నుంచి ఫ్లైట్‌ ఖర్చులు కూడా తెచ్చుకోలేకపోయారని మండిపడ్డారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం జగన్‌ ఢిల్లీ వెళ్లారా? అని ప్రశ్నించారు. ఎన్ని నిమిషాలు మాట్లాడారో కాదు.. ఎన్ని నిధులు తెచ్చారు? అని నిలదీశారు. జగన్‌ ఢిల్లీ టూర్‌తో రాష్ట్రానికి ఒక్క రూపాయి ప్రయోజనం లేదన్నారు.

మోదీకి ఇచ్చిన వినతిపత్రం అంశాలను బయటపెట్టలేదన్నారు ఆయన. అదే విధంగా నవరత్నాలకు కూడా కేంద్రమే సహాయం చేయాలి అనే రీతిలో సీఎం జగన్‌ మాట్లాడుతున్నారన్నారు. 8 నెలల్లో ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టారు. జగన్‌ అప్రజాస్వామిక విధానాలు అవలంభిస్తున్నారని యనమల ఆరోపించారు. జగన్‌ను ఢిల్లీకి పిలిపించి మరీ ప్రధాని చీవాట్లు పెట్టారని మాకు సమాచారం ఉందన్నారు.

ప్రజలకు ఉపయోగపడే బిల్లులను మండలి అడ్డుకోదని, ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు చేస్తానంటే సభ్యులుగా తామూచూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసారు. జనరల్‌ బిల్లులకు, మనీబిల్లులకు తేడా తెలియకుండా వైసీపీ సభ్యు లు మ్లాడుతున్నారని, 14రోజుల నిబంధన మనీబిల్లులకే వర్తిస్తుందన్నారు. జనరల్‌ బిల్లులకు 4నెలల సమయం ఉంటుందని, ఛైర్మన్‌పై ప్రివిలేజ్‌ నోటీస్ ఇస్తామనడంకూడా వారి తెలియనితనానికి నిదర్శనమన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version