సరిసంఖ్య ఉన్న తేదీల్లో దంపతులు కలిస్తే మగపిల్లలు పుడతారట.. సాధువు వివాదాస్పద వ్యాఖ్యలు..

-

మన దేశంలో ఎంతో పురాతన కాలం నుంచి స్త్రీలపై లింగ వివక్ష కొనసాగుతోంది. వారిని అప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్న చూపు చూస్తూనే వస్తున్నారు. ఇక ఇప్పటికీ చాలా మంది దంపతులు తమకు బిడ్డంటూ పుడితే మగబిడ్డే పుట్టాలని, ఆడపిల్ల పుట్టకూడదని కోరుకుంటుంటారు. మన సమాజంలో ఈ దురాచారం ఎప్పటినుంచో వేళ్లూనుకుపోయింది. అయితే ఈ దురాచారాన్ని మరింత ప్రేరేపించేలా ఆ సాధువు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…

మహారాష్ట్రకు చెందిన సాధువు ఇందురికర్‌ మహారాజ్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. దంపతులు తమకు మగబిడ్డ పుట్టాలనుకుంటే సరిసంఖ్యలో ఉన్న తేదీల్లో శృంగారంలో పాల్గొనాలని చెబుతున్నారు. ఇక బేసి సంఖ్యలో ఉన్న తేదీల్లో దంపతులు కలిస్తే ఆడపిల్లలు పుడతారని, అదే సరైన టైములో శృంగారంలో పాల్గొనకపోతే పుట్టబోయే పిల్లలు తమ కుటుంబానికి చెడ్డ పేరు తెస్తారని అన్నారు. దీంతో ఆయన వాఖ్యల పట్ల మహిళలు మండి పడుతున్నారు.

సాధారణంగా మన దేశంలో గర్భంతో ఉన్న స్త్రీలకు స్కానింగ్‌ పరీక్షలు చేసి లింగ నిర్దారణ చేయరాదు. అలా చేస్తే నేరమవుతుంది. ఆర్టికల్‌ 22 ప్రకారం అలాంటి చర్యలు శిక్షార్హమవుతాయి. అయితే ప్రస్తుతం ఆ సాధువు చేసిన వ్యాఖ్యలు కూడా ఈ చట్టం పరిధిలోకే వస్తాయని, అందుకని ఆయనను కూడా అరెస్టు చేసి శిక్ష విధించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. మరి ఆ సాధువు దీనిపై మళ్లీ ఎలా స్పందిస్తారో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version