మెదడువాపు వ్యాదికి జండూ బామ్ పూసి సరిపెడుతున్న బాబు!!

-

ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి చాలా దారుణంగా ఉందనేది రాజకీయాలపై ఏమాత్రం అవగాహన లేనివారికి కూడా ఇట్టే అర్ధంఅవుతుంది! ఈ విషయంలో తమ్ముళ్లు కూడా తెగ ఫీలయిపోతున్నారు. ప్రస్తుతం టీడీపీకి ఆపరేషన్ అవసరమైనంత పెద్ద వ్యాది వస్తే.. తలపోటే కదా అని జండూ బాం రాయడం న్యాయం కాదు.. ఈలోపు వ్యాది ముదిరిపోతుంది.. అని చెబుతున్నారంట తమ్ముళ్లు!!

అవును… “కరోనా జనానికి అలవాటైపోయిందో.. జనం కరోనాకు అలవాటైపోయారో తెలియదు కానీ.. కార్యకర్తలుగా తామంతా ఎవరిపని వారు చేసుకుంటున్నాం.. అవసరమైనప్పుడు బయట తిరుగుతున్నాం.. ఇప్పటికే పార్టీ తగలబడింది చాలు.. ఇకనైనా బయటకు రండి.. జనాల్లోకి వెళ్దాం” అని చంద్రబాబు – చినబాబులకు గిల్లి మరీ చెబుతున్నారంట టీడీపీ నేతలు! కరోనా అంటే భయం ఉండొచ్చు.. జాగ్రత్తలు తీసుకోవచ్చు.. కాని మరీ ఇంత భయం, ఈ రేంజ్ జాగ్రత్తలు అవసరం లేదని చెబుతున్నారంట!

రాష్ట్రంలో కరోనా పోయిన తర్వాతే జనాల్లోకి వెళ్దాం అని భావిస్తే.. ఈలోపు కరోనాకంటే ముందు టీడీపీ కనుమరుగైపోయే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట! ఒకపక్క జగన్.. జనంలో రోజు రోజుకీ హీరో అయిపోతున్నాడు.. జనానికి మరింత దగ్గరైపోతున్నాడు. ఈ పరిస్థితుల్లో తమరు ఇంకా భాగ్యనగరంలోనే ఉంటూ.. జూం మీటింగులు పెడుతూ.. దేవాలయాలపై దాడులను ఖండించాం.. వైకాపాను ఇరుకునపెట్టాం అని సంభరపడటం వంటివి చూస్తుంటే… మెదడువాపు వ్యాదికి జండూ బామ్ పూసి సరిపెడుతున్నట్లు ఉందని చెబుతున్నారంట తమ్ముళ్లు!!

మరి వారిది కూడా లాజిక్కే… కాని ఆ లాజిక్కులు, తమ్ముళ్ల మ్యాజిక్కులు, బాబును కరోనా భయం నుంచి బయటపడేయలేవనేది మాత్రం వాస్తవం.. వాస్తవం!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version