ఏపీ రాజకీయాలు ఎంత హాట్ హాట్‌గా నడుస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపిల మధ్య మాటల యుద్ధమే కాదు…చేతల యుద్ధం కూడా జరుగుతుంది. ఆఖరికి దాడులు చేసుకునే వరకు పరిస్తితి వచ్చింది. టిడిపి నేత పట్టాభి…జగన్‌ని తిట్టడం….వైసీపీ వాళ్ళు ఏమో టిడిపి ఆఫీసులపై దాడులు చేయడం జరిగిపోయాయి. ఆ తర్వాత నుంచి రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం హోరాహోరీగా నడుస్తోంది. దీక్షలు కూడా పోటాపోటిగా చేస్తున్నారు.
అసలు కొన్ని రోజుల నుంచి కేశినేని…టిడిపిని వీడుతున్నారని ప్రచారం నడుస్తోంది. అందుకే తన కేశినేని భవన్‌లో చంద్రబాబు ఫోటో కూడా తీసేశారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలని కేశినేని అనుచరులు ఖండించారు…ఆయన టిడిపిలోనే ఉంటున్నారని అన్నారు. సరే టిడిపిలో ఉంటే ఇంత రచ్చ జరుగుతున్నప్పుడు ఒక్క మాట అయినా మాట్లాడాల్సి ఉంటుంది. పోనీ ఎక్కడ ఉన్నా సరే సోషల్ మీడియా వేదికగా చెప్పాల్సి ఉంటుంది. కానీ కేశినేని అదేం చేయలేదు…అంటే కేశినేని టిడిపి అధిష్టానంపై ఎంత గుర్రుగా ఉన్నారో అర్ధమవుతుంది. ఆయన పార్టీని వీడటానికే సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
ఇక కేశినేనితో పాటు గల్లా కూడా జంప్ చేసేలా ఉన్నారు. ఈ మధ్య ఆయన ఏమైపోయారో తెలియడం లేదు. పైగా గుంటూరు ఎంపీ అయి ఉండి, మంగళగిరిలో తమ పార్టీ ఆఫీసుపై జరిగిన దాడిని ఖండించలేదు. పోనీ ఎక్కడైనా ఉంటే సోషల్ మీడియా వేదికగా స్పందించాలి…కానీ అలా చేయలేదు. తన తనయుడు సినిమా గురించి పోస్ట్ చేశారు గానీ, పార్టీ ఆఫీసుపై దాడి గురించి మాట్లాడలేదు. అంటే ఈ ఇద్దరు ఎంపీలు బాబుకు హ్యాండ్ ఇచ్చేలాగానే ఉన్నారు.