యాసంగి లో ఆ పంటనే వేయాలి : రైతులకు తెలంగాణ సర్కార్ ఆదేశాలు !

-

యాసంగిలో మినుములు సాగు చేయాలని రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ యాసంగి లో మినుములు విరివిగా సాగు చేయాలని కోరారు. పూర్తి స్థాయి లో మార్క్ ఫెడ్ ద్వారా మినుముల కొనుగోలుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రైతులు వెంటనే మినుములను విత్తు కోవాలని పిలుపునిచ్చారు.

మినుముల కనీస మద్ధతు ధర క్వింటాలుకు రూ. 6300 ఇస్తామని.. మార్కెట్ ధర కనీస మద్ధతు ధర కన్నా ఎక్కువ ఉన్నా కూడా అదే ధర కు కొనడానికి ప్రభుత్వం సిధ్దం గా ఉందని ప్రకటించారు. దీని కోసం అవసరమైనన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.

దేశ వ్యాప్తం గా మినములు, మినపపప్పు కొరత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ ను సంప్రదించిందన్నారు. నిన్న నే రాష్ట్రానికి మినుముల కొనుగోలుకు సంబంధించి లిఖితపూర్వక హామీ నాఫెడ్ సంస్థ ఇచ్చిందని పేర్కొన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మినుముల తో పాటు మార్కెట్ లో డిమాండ్ ఉన్న పెసర్లు, వేరుశెనగ, ఆవాలు, నువ్వులు, పొద్దు తిరుగుడు వంటి పంటలు సాగు చేయాలని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version