జ‌గ‌న్ స‌ర్కారుపై టీడీపీ మ‌రో యుద్ధం… కొత్త రాజ‌కీయం మొద‌లు..!

-

ఏపీలో సీఎం జ‌గ‌న్ టార్గెట్‌గా టీడీపీ మ‌రో యుద్ధానికి రెడీ అయ్యింది. రాజ‌కీయాల్లో అధికార ప‌క్షంపై ఎలాగైనా పై చేయిసాధించాల‌ని చూస్తున్న పార్టీలు పెరుగుతున్నాయి. ప్ర‌స్తుతం ఏపీలో జ‌రుగుతున్న రాజ‌కీయాలు ఇదే కోవ‌లో ఉన్నాయి. త‌మ ఇష్టాలే త‌ప్ప‌.. పార్టీ అధినేత‌లు ప్ర‌జ ల ఇష్టా ఇష్టాల‌కు ఏమాత్రం విలువ ఇస్తున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై న లువైపుల నుంచి కూడా విరుచుకుప‌డుతున్నారు. వాస్త‌వానికి గ‌త ప్ర‌భుత్వంలో చోటు చేసుకున్న త‌ప్పుల ను తాను స‌రిదిద్దుతున్నాన‌ని చెబుతున్న జ‌గ‌న్‌.. ఈ క్ర‌మంలోనే రివ‌ర్స్ టెండ‌ర్లు చేప‌ట్టారు. వ్య‌వ‌స్థ ప్ర‌క్షా ళ‌న‌కు బీజం వేస్తున్నారు. అనేక మార్పుల దిశ‌గా రాష్ట్రాన్ని ముందుకు న‌డిపిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో జ‌రిగిన అడ్డగోలు నియామ‌కాల‌పై కూడా జ‌గ‌న్ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. తాజాగా రాష్ట్రంలోని వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ప‌నిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌పై జ‌గ‌న్ ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. గ‌త ప్ర‌భుత్వం ప‌ర్మినెంట్ ఉద్యోగా ల‌స్థానంలో విరి విగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల‌కు ప్రాధాన్యం ఇచ్చింది. ఈ క్ర‌మంలో అధికారుల ఇష్టానికి, పార్టీ నేత‌ల ప్ర‌మేయానికి కూడా ఛాన్స్ ఇచ్చేసింది. దీంతో అన్ని శాఖ‌ల్లోనూ లెక్క‌కు మిక్కిలిగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామ‌కాలు జ‌రిగిపోయాయి. ప‌ని త‌క్కువ సిబ్బంది ఎక్కువ అనేలా శాఖ‌ల్లో వీరు నిండిపోయిన మాట వాస్త‌వ‌మేన‌ని ఉద్యోగ సంఘాలే ఇటీవ‌ల వెల్ల‌డించాయి.

అలాంటి ప‌రిస్థితిలో దీనిని ప్ర‌క్షాళ‌న చేసేందుకుజ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు. అది కూడా ఉప ముఖ్య‌మం త్రి పుష్ప శ్రీవాణి స‌హా మంత్రి రంగ‌నాథ రాజు వంటి వారు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఇక బుగ్గ‌న కూడా లెక్క లేకుండా వీరు చేరిపోయార‌ని, వీరి ప‌రిస్థితేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. దీంతో జ‌గ‌న్ ఇప్పుడు వీరి లెక్క‌లు తీస్తున్నారు. దీంతో చిత్ర‌మైన సంగ‌తలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. వాస్త‌వానికి ఏ ప్ర‌భుత్వ శాఖ‌లైనా రెగ్యుల‌ర్ ఉద్యోగులు ఉంటారు. వీరు చాల‌ని స‌మ‌క్షంలో ఔట్ సోర్సింగ్‌, కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో కొంద‌రిని నియ‌మించుకుంటారు. దీనికి సంబంధించి ఒక ఫార్మాట్ ఉంది. త‌మ‌కు ఎంత మంది ఉద్యోగులు అవ‌స‌రం? ఎంత‌మంది కావాలి?

అనే విష‌యాల‌ను ఆర్థిక శాఖ‌కు పంపి.. దాని నుంచి లైన్ క్లియ‌ర్ చేసుకున్నాక నియామ‌కాల సెక్ష‌న్‌ను పంపాలి. అయితే, గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ఆర్థిక శాఖ‌కు చెప్ప‌కుండానే , ఎవ‌రి అనుమ‌తులూ లేకుండానే వేలాది మందిని ఉద్యోగాల్లో నియ‌మించుకున్నారు. దీనిపై అప్ప‌ట్లోనే ఆర్థిక మంత్రిగా ఉన్న య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఫైర‌య్యారు. ఎవ‌రికి ఇష్టానికి వారు ఉద్యోగుల‌ను నియ‌మించుకుంటే.. మేం జీతాలు ఇవ్వాలా? అని ఆయ‌న ప్ర‌శ్నించ‌డం సంచ‌ల‌నం రేపింది. ఇంత‌లోనే ఎన్నిక‌లు, ప్ర‌భుత్వం మారిపోయిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఇదేప‌నిని జ‌గ‌న్ స‌ర్కారు చేస్తోంది.

ఇబ్బ‌డి ముబ్బ‌డిగా ఎవ‌రి ఆదేశాలు, అనుమ‌తులు లేకుండానే శాఖాధిప‌తులు నియామ‌కాలు చేప‌ట్టిన వారిని ఇప్ప‌టి వ‌ర‌కు ఇవ్వాల్సిన మొత్తం ఇచ్చి వ‌దిలించుకోవాల‌ని చూస్తోంది. అయితే, దీనిని కూడా రాజ‌కీయం చేసేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తుండ‌డం దార‌ణ‌మ‌ని అంటున్నారు ప్ర‌శ్నిస్తున్నారు ప‌రిశీల‌కులు. ఉద్యోగులు ఎలా నియ‌మితులైనా.. త‌ప్పు చేసిన వారిని గుర్తించి శిక్షించ‌మ‌ని అడ‌గ‌కుండా.. ఉద్యోగులను కాపాడే ప్ర‌య‌త్నం చేయ‌కుండా ఆయ‌న దీనిని కూడా త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుంటున్నార‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version