ఆ నగరం మొత్తం పొగే… గాల్లో మార్పులతో ఉన్నట్టుండి మంటలు… పొగ వీడియో వైరల్…!

-

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు దెబ్బకు సిడ్నీ నగరం మొత్తం పొగ దుప్పటి కప్పుకుంది. గత కొన్ని రోజులు ఆస్ట్రేలియాలో కార్చిచ్చు అక్కడి అడవులను దహించి వేస్తున్న సంగతి తెలిసిందే. భారీ ఎత్తున చెలరేగిన మంటల దాటికి… వేల ఎకరాల్లో అడవులు, కొన్ని వందల గృహాలు మాడి మసి అయిపోతున్నాయి. దీనితో నగరాల్లో, గ్రామాల్లో మొత్తం పొగ వ్యాపించి గాలి పీల్చుకోవడమే అక్కడి ప్రజలకు కష్టంగా మారింది. రాత్రి సమయాల్లో బలమైన గాలుల దెబ్బకు… దిగువ ప్రాంతాల్లో మంటలు వ్యాపిస్తున్నాయని అక్కడి వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

దీనితో దేశంలోనే అతి పెద్ద నగరంగా ఉన్న సిడ్నీలో గాలి నాణ్యతను కొన్ని సమయాల్లో “ప్రమాదకర” స్థాయిలకు చేరిందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని న్యూ సౌత్ వేల్స్లో సుమారు ఐదు మిలియన్ల మంది నివాసం ఉంటారు. ఇప్పుడు అక్కడి ప్రజలకు ఈ పొగ చుక్కలు చూపిస్తుంది. పొగతో పాటుగా… దుర్వాసన కూడా వస్తుందని వాపోతున్నారు ప్రజలు. కొన్ని వారాలుగా ఈ పరిస్థితి ఉందని ప్రభుత్వం ఏదొక చర్య తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ఇళ్ల సమీపంలో ఉన్న పొదల్లో కూడా మంటలు రావడంతో భయపడిపోతున్నారు.

నగరానికి పశ్చిమాన ఉష్ణోగ్రతలు 37 సి (98.6 ఎఫ్) కు పెరగడంతో సిడ్నీ నివాసితులకు మంగళవారం తీవ్రమైన అగ్ని ప్రమాద హెచ్చరికలు చేశారు అధికారులు. రాబోయే కొద్ది రోజులు పొగ చుట్టుముట్టే అవకాశం ఉందని ఉన్నట్టుండి మంటలు చెలరేగే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. ఇక ఉబ్బసం బాధితులు, ఊపిరి తిత్తుల సమస్యలు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని, కుదిరితే అక్కడి నుంచి వెళ్లిపోవడం మంచిది అని హెచ్చరించారు. కొన్ని ప్రాంతాలు వాయు కాలుష్య స్థాయిలను జాతీయ బెంచ్ మార్క్ కంటే ఎనిమిది రెట్లు అధికంగా నమోదు చేశాయి. గాల్లో మార్పుల కారణంగా ఉన్నట్టుండి మంటలు చెలరేగే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version