అమరావతి నుండి రాష్ట్ర అసెంబ్లీని తొలగించాల్సిందే అంటూ ఏపీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ వ్యాఖ్యల వెనక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వున్నారా? . లేక ఉద్దేశ పూర్వకంగానే నానితో ఈ వ్యాఖ్యలు చేయించారా అన్నది ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ రోజు అమరావతి తరలింపుపై వ్యాఖ్యానించిన కొడాలి నాని పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. తమ ప్రభుత్వం పేద కుటుంబాలకు భూముల్ని కేటాయించాలనుకుంటోందని, అమరావతి చెందిన రైతు కుటుంబాలు ఇందులో ముఖ్యంగా వుండనున్నాయని వెల్లడించారు. అయితే ఈ పథకం అమలు చేయకుండా ప్రతి పక్ష టీడీపీ అడ్డు తగులుతూ కోర్టుకు వెళ్లిందని, స్టే కూడా తీసుకురావడం దురదృష్టకరమన్నారు. అమరావతిలో పేదలకు చోటు లేనప్పుడు అసెంబ్లీ మాత్రంఇ ఇక్కడ ఎందుకు వుండాలని కొడాలి నాని ఎదురుప్రశ్నించారు.
ఈ విషయంపై ముఖ్యమంత్రి జవైఎస్ జగన్‌ని కలిశానని, తన విజ్ఞప్తిని ఆయన ముందు ఉంచానని స్పష్టం చేశారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చిస్తానని ఆయన తనకు మాటిచ్చారని చెప్పుకొచ్చారు. అయితే నాని మాటలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన టీడీపీ వర్గాలు మాత్రం మండి పడుతున్నాయి. కృష్టా జిల్లాకు చెందిన మంత్రిగా కొడాలి ఆ జిల్లా అభివృద్ధికి పాటుపడటం లేదని, అమరావతి నుంచి అసెంబ్లీని తరలిస్తామంటూ రైతుల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కొడాలిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.