టీడీపీ నేత‌ల మాట‌లు చివ‌ర‌కు జోకుల‌య్యాయే..!

-

అవును! మైనార్టీల‌కు ఏదో అన్యాయం జ‌రిగిపోతోంద‌ని, జ‌గ‌న్ ప్ర‌భుత్వం వారిని ప‌ట్టించుకోవ‌డం మానేసింద‌ని.. టీడీపీ నేత‌లు ఊరికో మైకు ప‌ట్టుకుని ప్ర‌చారం చేస్తున్నారు. మైనారిటీలపై ఎనలేని మమకారం తమకే ఉందన్నారు. అధికారంలోకి వస్తే వారి సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు.  43 లక్షల మంది మైనారిటీలకు ఎన్నో ఆశలు కల్పించారు. తీరా అధికారంలోకి వచ్చాక బడ్జెట్‌లో అంకెలగారడీ చేశారు! మైనారిటీలకు రూ.2055 కోట్లు అని చేసిన ఆర్భాటపు ప్రకటన చూసిన ఆసాంతం పరిశీలించిన వారు ఈ జిమ్మిక్కులు చూసి నివ్వెరపోతున్నారు!  అని టీడీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు.

అంతేకాదు, జ‌గ‌న్‌ ప్రభుత్వం నవరత్నాలతో అందరికీ ఇస్తున్న పథకాలను సైతం మైనారిటీ బడ్జెట్‌లో లెక్కించి తిమ్మిని బమ్మిని చేసింద‌ని దుయ్య‌బ‌డుతున్నారు. ఇంత‌టితో ఆగ‌కుండా.. టీడీపీ తెచ్చిన పథకాలను అటకెక్కించార‌ని కూడా త‌మ్ముళ్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంద‌ని స‌రిపెట్టుకున్నా.. మ‌రి టీడీపీ హ‌యాంలో నిజంగానే మైనార్టీల‌కు  న్యాయం జ‌రిగిందా ?  వారిని బాగానే చూసుకున్నారా? అంటే.. వారిక‌ని ప్ర‌క‌టించిన ప‌థ‌కాల్లో ఏ ఒక్క‌టికూడా సంపూర్ణంగా అమ‌లు కాని విష‌యం అంద‌రికీ తెలిసిందే.

మ‌క్కా యాత్ర‌కు వెళ్లేవారికి అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నిధులు ప్ర‌క‌టించింది. కానీ, టీడీపీకి అనుకూలంగా ఉన్న‌వారిని ఎంపిక చేసి.. దీనిని వ‌ర్తింప జేశార‌ని. అప్ప‌ట్లోనే తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక‌, అంతేకాదు, మైనార్టీ అభ్య‌ర్థులు లేర‌నే మిష‌తో వైఎస్సార్ సీపీ త‌ర‌ఫున గెలిచిన ఇద్ద‌రిని పార్టీలోకి తీసుకున్నారు. అయినా వారికి మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌లేదు. ఏకంగా ఐదేళ్ల‌పాటు మైనార్టీ శాఖ‌కు మంత్రినే లేకుండా రాష్ట్రాన్ని పాలించేశారు. కానీ, జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొలువుదీరిన వెంట‌నే మైనార్టీ నేత‌కు ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇచ్చారు.

వారికి అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నారు. అయినా కూడా టీడీపీ నేత‌ల‌కు ఇవేమీ ప‌ట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌న‌సులో ఒక‌టి పెట్టుకుని మైనార్టీ వ‌ర్గాన్ని ప‌ట్టుకుని వేలాడుతున్నార‌నే భావ‌న స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే మైనార్టీ గురించి టీడీపీ నేత‌లు మాట్లాడితే.. జోక్‌గా ఉంద‌ని.. అంత‌కు మించి కామెడీ మ‌రోక‌టి ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version