పాటిల్‌ దంపతులకు ఘనస్వాగతం పలికిన డీజీపీ..!

-

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవలే కరోనా వైరస్ బారిన పడిన ఐపీఎస్ దంపతులు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుని కరోనా వైరస్ బారి నుండి కోలుకున్నారు. కరోనా వైరస్ ను జయించిన వారు తిరిగి శుక్రవారం విధుల్లో చేరారు. దిశా స్పెషలాఫీసర్ దీపికా పటేల్, డిసిపి విక్రాంత్ పాటిల్ దంపతులకు ఇటీవల కరోనా పాజిటివ్ నిర్దారణ కాగా.. ఆస్పత్రిలో చికిత్స తీసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లో చేరారు. కాగా తిరిగి విధుల్లో చేరిన ఐపీఎస్ దంపతులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఘనస్వాగతం పలికారు.

djp

ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లడుతూ.. కోవిడ్‌ను జయించిన పోలీసు అధికారులు ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని పిలుపునిచ్చారు. కరోనా బాధితుల్లో మనోస్థైర్యాన్ని నింపాలని, విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఏ మాత్రం అనుమానం ఉన్న వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణలో కోవిడ్‌ బారినపడిన పోలీసులు కోలుకొని విధుల్లో రావడం ఆనందంగా ఉందని డీజీపీ వ్యాఖ్యానించారు. పాటిల్‌ దంపతులు మాట్లాడుతూ.. డీజీపీ ఇచ్చిన నైతిక బలంతోనే త్వరగా కోలుకున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version