బ్యాగులతో కొట్టిన జగన్ ? విలవిలలాడుతున్న టీడీపీ ?

-

జగన్ మావయ్య బ్యాగులు ఇచ్చాడు , బుక్స్ ఇచ్చాడు.. బూట్లు ఇచ్చాడు.. బట్టలు ఇచ్చాడు… గోరుముద్దలు తినమంటూ బలమైన పౌష్టికాహారం ఇస్తున్నాడు… కార్పొరేట్ స్కూళ్ళకు ఏమాత్రం తీసుకోకుండా, స్కూళ్లు, మోడరన్ గా తీర్చిదిద్దాడు. అమ్మ ఒడి అంటూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే మా ఖర్చుల నిమిత్తం మా తల్లి అకౌంట్లోకి 15 వేల రూపాయలు వేశాడు. సైకిల్ ఇస్తున్నాడు.. వేలకు వేలు, లక్షలకు లక్షలు పెట్టి చదువుకుంటే గాని రాని ఇంగ్లీష్ మీడియం ను ఉచితంగానే అందించేందుకు ఏర్పాట్లు చేశాడు. అబ్బబ్బా ఇంతకంటే ఇంకేం కావాలి. టాయిలెట్ లను సైతం సౌకర్యవంతంగా, మోడ్రన్ గా తయారుచేయించి మా ఇబ్బందులను తీర్చాడు. అసలు జగన్ మావయ్య  ఆ బడులను, మా ఇబ్బందులను ఇంతగా తీరుస్తాడని కలలో కూడా అనుకోలేదని ఇప్పుడు పిల్లలంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నారు.
650 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ  స్కూళ్ళల్లో చదువుకుంటున్న విద్యార్థులకు విద్యా కానుక అందిస్తున్నాడు. నవంబర్ లో బదులు  మొదలయ్యే అవకాశం ఉండడం తో, విద్యార్థులకు అన్ని రకాలుగానూ సౌకర్యాలను స్కూల్ సమకూర్చాడు. అసలు స్కూళ్ల గురించి ఇంత శ్రద్ధగా పట్టించుకోవడంతో, అటు విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు అన్ని వర్గాల నుంచి పార్టీలకు అతీతంగా జగన్ ప్రభుత్వం పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంతగా ఈ విషయంలో ప్రశంసలు అందుకుంటున్న టిడిపికి మాత్రం ఈ వ్యవహారం మింగుడు పడడం లేదు. అసలు ఈ వ్యవహారంలో ఏ విధంగా ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించాలో తెలియడం లేదు. గత టీడీపీ ప్రభుత్వం లో అసలు ఇటువంటి ఆలోచన తమకు ఎందుకు రాలేదని పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. ఒకవేళ దీనిపైన యథాప్రకారం విమర్శలు చేద్దామంటే ఇప్పటి వరకు చేసిన విమర్శలు ఒక ఎత్తు అయితే , ఇప్పుడు చేద్దామనుకుంటున్న విమర్శలు మరొక ఎత్తు అవుతాయి.
అన్ని వర్గాల ప్రజల నుంచి చీదరింపులు, చిత్కారాలు, ఎదురవుతాయనే  బెంగ టిడిపి నాయకుల్లో ప్రస్తుతం నెలకొంది. జగన్ తమను ఆషామాషీగా కొట్టలేదని, భుజానికి బ్యాగ్ తగిలించుకుని స్కూల్ పిల్లలతో కలిసి కోలుకోలేని , భరించలేని దెబ్బ కొట్టాడని, ఈ దెబ్బ మానడానికి ఎన్నేళ్లు పడుతుందో అనే బాధ ప్రస్తుతం టిడిపి నాయకుల్లో పెరిగిపోతోందట..! అయ్యో పాపం
-Surya

Read more RELATED
Recommended to you

Exit mobile version