గూబలు ఎర్రబడేసరికి దళితులు గుర్తొచ్చారా…. క్లారిటీ ఉందంట!

-

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నచందంగా ఉంటుంది కొందరు రాజకీయ నాయకుల తీరు! జనాలకు అల్జీమర్ వ్యాది లేదు అన్న సంగతి మరిచిన కొందరు నేతలు… వేషాన్ని బట్టి మాటలు మార్చినట్లు హోదాలను బట్టి అభిప్రాయాలు మార్చేస్తున్నట్లున్నారు! అధికారపక్షంలో ఉన్నప్పుడు కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తించిన నాయకులు… గూబలు ఎర్రబడేసరికి మైకం దిగి మామూలుగా మాట్లాడుతున్నట్లున్నారు! ఇందులో భాగంగా డాక్టర్ సుధాకర్ పేరుచెప్పి దళితులపై తమకు ఎక్కడలేని ప్రేమ ఉందన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ నేతలు! అధికారంలో ఉన్నప్పుడు కళ్లు మూసుకుపోయి వీరంతా దళితులపై చేసిన వ్యాఖ్యలు తెలుగు ప్రజలు ఎవ్వరూ మరిచిపోలేదు అన్న విషయం వీరు మరిచినట్లున్నారు!

గతంలో అధికారంలో ఉన్నప్పుడు కన్నూ మిన్నూ కానకుండా… టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ నేతలు తమ నోటి తీట చూపిస్తూ… ఇతర కులాలని దూషిస్తూ, చులకన చేస్తూ మాట్లాడుతూ వారి అహంకారాన్ని ప్రదర్శించిన సంగతి అందరికీ తెలిసిందే! ఎస్సీల గా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ తన నీచమైన బుద్ధిని బైటపెట్టుకున్న చంద్రబాబు కు నేడు దళితులపై ఎక్కడలేని ప్రేమ గుర్తుకు వచ్చేస్తుంది! తాను దళితులపై ప్రేమ నటిస్తున్నట్లు ఎక్కువగా మాట్లాడితే బాగోదనో ఏమో కానీ… టీడీపీలో ఉన్న దళిత నేతలతో తెగ ప్రేమ కురిపించేస్తున్నారు. మరి ఈ దళిత నేతలు నాడు బాబు మాటలను ఎందుకు ఖండించలేదు? నిస్సిగ్గుగా మౌనంగా ఎలా ఉండిపోగలిగారు!!

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లుగా నాటి చంద్రబాబు ప్రభుత్వంలో మార్కెటింగ్ శాఖా మంత్రి ఆదినారాయణ రెడ్డి దళితులను కించపరిచేలా … వారికి శుభ్రత ఉండదని, చదువుకోరని, రిజర్వేషన్ లతో అధికారాలు పొందుతున్నారంటూ కుల దురహంకారానికి చిహ్నంగా మాట్లాడారు! ఇక ఇప్పుడు మైకుల ముందుకు వచ్చి దళితులకు తానేదో నాయకుడి అన్నట్లుగా తెగ హడావిడి చేస్తున్న వర్ల రామయ్య సైతం నాడు మచిలీపట్నం బస్టాండులో ఎలాంటి మాటలు మాట్లాడారో ఎవ్వరూ మరిచిపోరు!

ఓ బస్సులోని యువకుడు ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని పాటలు వింటుండటాంటొ రామయ్య నిప్పులు తొక్కిన కోతిలా చెలరేగిపోయాడు. “నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోవా? నీ కులం ఏంటో చెప్పు? మాల లేదా మాదిగా? మాదిగలు అసలు చదవరు. బాగుపడరు… ఈ వెధవ పరీక్ష కూడా రాసి ఉండడు. మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? పొలం ఉందా? బ్యాంకులో ఎన్ని లక్షలు ఉన్నాయి? డబ్బులు లేకపోతే ఎలా చదువుకుంటావ్‌? ఫోన్లు గీన్లు మానేసి చదువుకో.. నా కొడకా” అంటూ రెచ్చిపోయారు!

ఇలాంటి నేతలతో, దళిత వ్యతిరేకులతో నిండిపోయిన ఆ పార్టీలోని నేతలు… ఇప్పుడు మైకుల ముందుకు వచ్చి జగన్ దళిత వ్యతిరేకి అని మాట్లాడటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. ఇంతకు మించిన దిగజారుడు రాజకీయాలు.. ఇంతకు మించిన నిస్సిగ్గు ప్రవర్తనలు ఉంటాయా..? ఇప్పుడూ దళితులపై తెగ తీపి కబుర్లు చెబుతున్న నోటితో.. నాడు ఎలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేశారో జనం మరిచిపోరు కదా!! ఈ సందర్భంలో… దళితుల పేరుచెప్పి టీడీపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలని… దళితులపై టీడీపీకి ఎంత ప్రేముందో తమకు తెలుసని.. ఆ విషయంపై తమకు ఫుల్ క్లారిటీ ఉందని… పలువురు దళిత నాయకులు, ప్రజలు.. బాబు అండ్ కో లకు క్లారిటీ ఇస్తున్నారు!!

Read more RELATED
Recommended to you

Exit mobile version