ఆంధ్రావనిలో ఎక్కువ ఆదాయం తీసుకువస్తున్నది ఆబ్కారీ శాఖ మాత్రమే! అందుకే సర్కారు కూడా అక్కడి నుంచే మరింత ఎక్కువ ఆదాయం తెచ్చుకునేందుకు నానా పాట్లూ పడుతోంది. ఆదాయం తో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా ! కానీ కోట్లలో ఆదాయం ఇస్తున్న మద్యం అమ్మకాలు ప్రజారోగ్యంపై విపరీతం అయిన దుష్ప్రభావాలు చూపిస్తున్నాయి అని ఇటీవలే తేలింది. ఇప్పటికే నాణ్యత లేని మద్యం అన్నది ఏపీ వ్యాప్తంగా సరఫరా అవుతోందని పేర్కొంటూ, సంబంధిత నమూనాలను వేర్వేరు ప్రాంతాల్లో సేకరించి ప్రయోగశాలకు పంపింది టీడీపీ.
మరోవైపు మద్యం ధరలు ఎక్కువగా ఉన్న కారణంగా నాటు సారా విక్రయాలన్నవి మరింత పెరిగిపోతున్నాయి. మద్యం కన్నా నాటు సారానే తక్కువ రేటుకు దక్కడం., సరిహద్దు నుంచి విపరీతంగా అడ్డూ అదుపూ లేకుండా సరఫరా అవుతుండడంతో వీటిపైనే మందుబాబులు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.దీంతో ఒడిశా సరిహద్దుల నుంచి వస్తున్న నాటు సారా అమ్మకాలు శ్రీకాకుళం మొదలుకుని రాష్ట్ర వ్యాప్తంగావిస్తారంగా సాగుతున్నాయి. మరి ! మద్య నిషేధం అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి వీటిపై ఎందుకు అని స్పందించలేకపోతున్నారు ? ఓవైపు నాణ్యమైన మందు సరఫరా చేయలేక, మరోవైపు నాటు సారా రవాణాను కట్టడి చేయలేక సీఎం రెండు విధాల వైఫల్యం చెందుతున్నారని టీడీపీ ఆరోపణలు గుప్పిస్తోంది.
ఆంధ్ర ప్రదేశ్ లో అమ్ముడు పోతున్న రాక్షస రసాయనాలు ఉన్నాయని ప్రయోగ పరీక్షలు నిర్థారించాయి. వాస్తవానికి సర్కారు తరఫున అమ్ముడవుతుపోతున్న మద్యంకు సంబంధించి ఎప్పటి నుంచో కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచివి కాదంటూ విపక్షం గగ్గోలు పెడుతోంది. ఆంధ్రాగోల్డ్ మొదలుకుని పలు మద్యం బ్రాండ్ల అమ్మకాలపై ఎప్పటి నుంచో సంబంధిత వినియోగదారులు కూడా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఇవి ఇప్పటికిప్పుడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాదు దీర్ఘకాలికంగా జన్యు సంబంధ సమస్యలను కూడా తెచ్చిపెడతాయి అని ప్రయోగ పరీక్షలు చెబుతున్నాయి.
ఇదే ఇప్పుడు ప్రయోగ ఫలితాల్లో కూడా నిర్థారణ అయిందని టీడీపీ అంటోంది. ఏపీ మద్యంలో హానికర రసాయనాలు లభ్యం అవుతున్నాయి అని, ప్రయోగ నివేదికల్లో తేలిన రసాయనాల్లో పైరోగలాల్, ఐసోపు లెరిక్ యాసిడ్, డై ఇథైల్ థాలేట్ వంటివి ఉన్నాయి. వీటి కారణంగా నరాలు లాగడం, ఎవ్వరో సూదులతో గుచ్చుతున్న విధంగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడం వంటివి జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. మరి ! వీటిపై వైసీపీ ఏం అంటోంది అన్నది చూడాలిక !