జనసేన పార్టీ (జేఎస్పీ), తెలుగు దేశం పార్టీ (టీడీపీ) పొత్తుల విషయమై ఇప్పటికీ ఓ అంచనాకు రాలేకపోతున్నాయి. ఈ విధంగా అయితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ మళ్లీ రెడ్లదే ఆధిపత్యం కావడం ఖాయం అని పరిశీలకులు అంటున్నారు. పొత్తుల లెక్క తేలకపోగా ఒక రోజు రోజంతా (సోమవారం, జూన్ ఐదు, 2022) కొట్టుకున్నారు. వెర్బల్ ఎటాక్ ఒకరిపై ఒకరు ఇచ్చుకున్నారు.
ఇవి ఆ రెండు పార్టీలకూ మంచిది కాదు. కొందరు టీడీపీ నాయకులు అస్సలు తమకు ఎవ్వరూ వద్దని వేదాంత ధోరణి చూపారు. కనబరిచారు. తరువాత మిన్నకున్నారు. ఇదే సమయంలో జనసేన అటు టీడీపీని టార్గెట్ చేస్తూనే, ఇటు తమ శక్తి తమకు తెలుసు అని అందుకే ఆ రోజు తమ దగ్గరికి పసుపు పార్టీ అధినేత బాబు వచ్చారు అని సీబీఎన్ ను ట్రోల్ చేసింది. దీంతో ఈ మాటల యుద్ధం ఓ రేంజ్లో నడిచింది.
ఇక తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ కూడా స్పందిస్తుందని అంతా భావించినా కూడా ఇంకా ఆ పార్టీ నుంచి కూడా ఏ క్లారిటీ రాలేదు. గత ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలన్న యావ కానీ తలంపు కానీ టీడీపీకి ఉండే ఉంటే తమ సహకారం కోరుతారని లేదంటే లేదని కూడా అంటోంది జనసేన. తాము గెలవకపోయినా వచ్చిన నష్టం ఏమీ లేదని కానీ టీడీపీ గెలవక పోతే అదొక జీవన్మరణ సమస్య అవుతుందని, వచ్చేసారి మరోసారి ఎన్నికల్లో గెలిస్తే వైసీపీ నాయకులు టీడీపీని నాయకులను గ్రామాల్లో తిరగనివ్వరని, స్వేచ్ఛగా తిరిగే విధంగా బతకనివ్వరని హెచ్చరిస్తోంది.
అధికారం అంతా టీడీపీ చేతిలోనే ఉంచుకుని తమ సాయం గతంలో కోరారు అని, అయినా చేశాం అని కానీ ఈ సారి ఆ విధంగా జరిగేందుకు వీల్లేదని జనసేన పదే పదే టీడీపీని ఉద్దేశించి అంటోంది. ఈ తరుణాన టీడీపీ వెర్షన్ మరో విధంగా ఉంది. తమకు ఏ ఆప్షన్లూ అక్కర్లేదని, ఒంటరిగా వెళ్లినా గెలుపు ఈ సారి ఖాయం అని అంటోంది. ఈ మాటల యుద్ధాన సోషల్ మీడియాలో ఓ మీడియా పోల్ కండక్ట్ చేసింది. అయితే చాలా మంది పొలిటికల్ యాక్టివిస్టులు వచ్చే ఎన్నికల్లో జగన్-ను ఎదుర్కోవాలంటే మాత్రం జేఎస్పీ,బీజేపీ, టీడీపీ కలవక తప్పదని చెబుతూ తమదైన తీర్పు చెబుతున్నారు. ఒపీనియన్ పోల్స్-లో కూడా 47 శాతం మంది ఈ ఈక్వేషన్-కే ఓటేయ్యడం గమనార్హం.