ఈ నెల 29న తెలంగాణలో TDP భారీ బహిరంగ సభ

-

ఈ నెల 29న తెలంగాణలో TDP భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. టిడిపి 42వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు టీటీడీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ నెల 29న బహిరంగ సభ నిర్వహణకు టీడీపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఎన్నికలకు సమయత్తం కావాలని భావిస్తున్నారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు తెలుగు రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్ దీవుల నుంచి 15 వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు కాసాని వెల్లడించారు. తెలంగాణలో అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు ప్రతినిధులకు స్వాగత ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version