అల్లు అర్జున్ ఇంటి వద్ద హై టెన్షన్..భారీగా పోలీసులు !

-

అల్లు అర్జున్ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున టాస్క్ ఫోర్స్ టీమ్స్‌.. మోహరించాయి. అల్లు అర్జున్ ఇంటి దారిలో రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో అల్లు అర్జున్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Huge security at Allu Arjun’s house

ఇక అటు అల్లు అర్జున్ మరోసారి పోలీస్ స్టేషన్‌ కు వెళ్లనున్నారు. మరికాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్ వెళ్లనున్నారు. ఇందులో భాగంగానే… నేడు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల అనంతరం తన లీగల్ టీమ్‌తో భేటీ అయ్యారు అల్లు అర్జున్.

విచారణకు హాజరవ్వాలా..? సమయం కోరాలా..? అనే విషయంపై లీగల్ టీమ్‌తో చర్చలు చేశారట అల్లు అర్జున్‌. సంధ్య థియేటర్ ఘటనపై ఇప్పటికే రూపొందించిన ఒక వీడియో ఆధారంగా అల్లు అర్జున్‌ను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version