అల్లు అర్జున్ మరోసారి పోలీస్ స్టేషన్ కు వెళ్లనున్నారు. మరికాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్ వెళ్లనున్నారు. ఇందులో భాగంగానే… నేడు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల అనంతరం తన లీగల్ టీమ్‌తో భేటీ అయ్యారు అల్లు అర్జున్.
విచారణకు హాజరవ్వాలా..? సమయం కోరాలా..? అనే విషయంపై లీగల్ టీమ్‌తో చర్చలు చేశారట అల్లు అర్జున్. సంధ్య థియేటర్ ఘటనపై ఇప్పటికే రూపొందించిన ఒక వీడియో ఆధారంగా అల్లు అర్జున్‌ను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇక అటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచలన నిర్ణయం తీసుకున్నారట. బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు.. రూ.2 కోట్లతో శ్రేతేజ్ ట్రస్ట్‌కు శ్రీకారం చుట్టారట అల్లు అర్జున్. ఇందుకోసం బన్నీ రూ.1 కోటి, సుకుమార్ రూ.50 లక్షలు, నిర్మాతలు రూ.50 లక్షలు ఇవ్వనున్నారు. ఇక ఈ ట్రస్ట్‌లో సభ్యులుగా.. శ్రీతేజ్ తండ్రి, సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు పెద్దలు ఉంటారని సమాచారం.