ఏపీలో ప్రస్తుతం రాజకీయాలు చాలా వేడి మీద ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ, వైసీపీ కార్యకర్తలు. నేతల మధ్య పరస్పర దాడుల దాకా వెళ్లాయి రాజకీయాలు. ఇండ్ల ముట్టడి పేరుతో అగ్గి రాజుకుంటోంది. ఇలాంటి తరుణంలో ఇక ప్రత్యక్షంగా రెండు పార్టీల నేతలు తలపడనున్నారు. ఇందుకోసం రెడీ అవుతున్నారు. త్వరలోనే ఏపీలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రిపేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇందుకోసం ఇప్పటికే సంబంధిత ఏర్పాట్లు కూడా చేస్తోంది. అయితే ఇప్పటి దాక చంద్రబాబు, జగన్ మైకుల ముందు మాట్లాడగా ఇప్పుడు నేరుగా పోరాడనున్నారు.
నిజానికి మిగతా వారికంటే కూడా సీఎం జగన్, చంద్రబాబు నాయుడు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులపై ఎలాంటి స్పందన చేస్తారో అనేది అందరికీ ఉత్కంఠగా మారింది. అయితే మన దేశంలో ఏ రాష్ట్ర అసెంబ్లీ సభలపై లేనంత క్రేజ్ కేవలం ఏపీ అసెంబ్లీలో మాత్రమే ఉంటుంది. ఎందుకుంటే ఇక్కడ చర్చలకంటే కూడా ఇరు పార్టీల నడుమ వ్యక్తిగత దూషణలకే ఎక్కువ టైమ్ కేటాయిస్తాయి. అందుకోసమే వీటిపై అంత క్రేజ్.
ఇక రీసెంట్ గా చంద్రబాబు నాయుడి ఇంటి ముట్టడి వైసీపీని కొంత ఇబ్బందుల్లో పెట్టే విధంగానే ఉన్నాయి. ఇక దాంతో పాటే జగన్ ప్రభుత్వం చేస్తున్న మితిమీరిన అప్పులపై కూడా టీడీపీ బాగానే పోరాడేలా ఉంది. ఇక ఈ లిమిట్ దాటేసి చేస్తున్న అప్పులపై కేంద్రం నుంచి కూడా విమర్శలు వస్తున్నందున జగన్ సర్కారుకు అవి మైనస్ అయిపోయాయి. ఇక అటు వైసీపీ బలం అసెంబ్లీలో ఎక్కువగా ఉన్నా కూడా టీడీపీకి మాట్లాడేందుకు బాగానే పాయింట్లు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరోవైపు జగన్‌మీద చేసిన కామెంట్ల విషయంలో వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి