హైదరాబాద్‌లోని హయత్ నగర్‌లోని భాగ్యలతోలో గల శ్లోక పాఠశాలలో ఓ టీచర్ విద్యార్థునుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. 8వ తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, ఇదేంటని అడిగిన విద్యార్థినులను ఇంగ్లీష్ టీచర్ కొట్టినట్లు సమాచారం.
టీచర్ కొట్టిన విషయాన్ని పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పారని విద్యార్థినులను మరోసారి ఇంగ్లీష్ టీచర్ షాపా కొట్టినట్లు తెలిసింది. పేరెంట్స్ వచ్చి అడిగితే తెలుగులో మాట్లాడారని, అందుకే కొట్టానని టీచర్ పాషా బుకాయించినట్లు సమాచారం.దీంతో విద్యార్థునుల పేరెంట్స్ పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిని కడిగి పారేసినట్లు తెలిసింది.ఈ ఘటన బయటకు రావడంతో శ్లోక స్కూల్లో విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగాయి.పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.