వాళ్ల ఇంటికి వెళ్లి భోజనం చేస్తా.. చిరంజీవి ఎమోషనల్

-

మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన పురస్కారం లభించిన విషయం తెలిసిందే. ప్రఖ్యాత లండన్ బ్రిడ్జ్ ఇండియా సంస్త మెగాస్టార్ కి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించింది. అంతేకాకుండా యునైటేడ్ కింగ్ డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో అక్కడి ఎంపీలు మినిస్టర్లు, ఎన్నారైలు చిరంజీవిని సత్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి లండన్ లో ఉన్న తెలుగు వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ” మీతో మాట్లాడుతుంటే నా కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్టే ఉంది. మీరంతా ఎప్పుడో ఒక సమయంలో నా సినిమాలను లేదా పాటలను విని స్పందించే ఉంటారు. మీ మాటలు నా దాకా చేరుతూనే ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న తెలుగువాళ్లతో కలవాలని ఎప్పుడు ఎదురు చూస్తుంటాను” అని తెలిపారు. మీ అందరి ఇంటికి వచ్చి నా చెల్లెమ్మల చేతి వంటలు తినాలని ఉందని.. అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదని ఎమోషనల్ అయ్యారు చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Latest news