ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనకు అప్లై చేయాలా? అర్హత వివరాలు, దరఖాస్తు చేసుకునే విధానం తెలుసుకోండి..!

-

భారత కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కొరకు ఎన్నోపథకాలను ప్రవేశ పెడుతూ వస్తోంది. అయితే వాటితో ఎన్నో ఉపాధి అవకాశాలతో పాటుగా ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తోంది. దీనిలో భాగంగా ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనా పధకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ పథకం ద్వారా నిరుపేదలకు, దివ్యాంగులకు మరియు ఇతర కార్మికులకు వివిధ ఆహార ధాన్యాలను, గ్యాస్ సిలిండర్లను అందజేస్తోంది.

 అర్హత వివరాలు:

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పధకానికి దరఖాస్తు చేసుకునే వారి కుటుంబ ఆదాయం నెలకు 15000 కంటే తక్కువగా ఉండాలి. అంతేకాకుండా భూమి లేని వ్యవసాయ కూలీలు, గ్రామీణ ప్రాంతానికి చెందిన కళాకారులు, కూలీలపై జీవించే కార్మికులు ఈ పధకానికి అర్హులు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పధకానికి వితంతువులు, దివ్యాంగులు లేక 60 ఏళ్లు పైబడిన వ్యక్తుల కుటుంబాలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసే విధానం:

ముందుగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకానికి దరఖాస్తు చేసుకునేవారు జన్ ధన్ ఖాతాను రిజర్వు బ్యాంకు గుర్తింపు పొందిన ఆథరైజ్డ్ బ్యాంకులో తెరవాలి. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత గరీబ్ కళ్యాణ్ యోజనకు సంబంధించిన అప్లికేషన్ ను పూర్తి చేయాలి. అప్లికేషన్ ఫారం తో పాటుగా ఆధార్ కార్డ్ , ఆదాయ ధ్రువీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో వంటి మొదలైన డాక్యుమెంట్లను అందజేయాలి. స్క్రీనింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత పథకానికి అర్హులైన వారికి సమాచారాన్ని అందిస్తారు.

ఈ పథకానికి అర్హులు అయిన వారికి ఉచితంగా ఆహార ధాన్యాలను అందజేస్తారు. సీనియర్ సిటిజెన్లకు, వితంతువులకు, దివ్యాంగులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. నిరుపేదలకు ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తారు. కేవలం నిరుపేదలు మాత్రమే కాకుండా క్లీనర్స్, వార్డ్ బాయ్స్, నర్స్, ఆశా వర్కర్లు, టెక్నీషియన్ లతో పాటుగా ఇతర హెల్త్ కేర్ వర్కర్లకు కూడా ఈ పథకంలో భాగంగా ప్రయోజనాలను అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news