సౌతాఫ్రికాతో జరుగుతున్ తుది టెస్టు మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేసారు. సిరీస్ నెగ్గాలంటే.. గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు దారుణంగా విఫలం అయ్యారు. టీమిండియా ఆటగాళ్లు అందరూ కేవలం 77.3 ఓవర్లు మాత్రమే ఆడి 223 పరుగులను చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లి (79) తో పాటు ఛతేశ్వర పుజారా (43) తప్ప మిగిలిన వారు అందరూ కూడా దారుణంగా విఫలం అయ్యారు. ఓపెనర్లు కెఎల్ రాహుల్ (12), మయాంక్ అగర్వాల్ (15) కూడా ఆశించిన స్థాయిలో రాణించ లేదు. అలాగే అజిక్య రహానే (9), వికెట్ కీపర్ రిషబ్ పంత్ (27) మరో సారి దారుణంగా విఫలం అయ్యారు.
అలాగే మొత్తం 11 మంది ఆటగాళ్లల్లో 5 ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితం అయ్యారు. కాగ సౌతాఫ్రికా బౌలర్ రబడ 4 వికెట్లను తీశాడు. అలాగే మార్కో జాన్సెన్ 3 వికెట్లు తీశాడు. అలాగే ఒలివర్, లుంనీ నింగిడి, మహారాజ్ తలో ఒక వికెట్ పడగొట్టారు. కాగ ఈ టెస్టు సిరీస్ నెగ్గి రికార్డు సృష్టించాలంటే.. ఈ మ్యాచ్ లో తప్పని సరిగా గెలవాలి. మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో ప్రస్తుతం రెండు జట్లు 1-1 తో సమానం గా ఉన్నాయి.