మతమార్పిడి వివాదంలో టీమిండియా క్రికెటర్.. ఆ సభ్యత్వం రద్దు!

-

మతమార్పిడి వివాదంలో టీమిండియా మహిళా క్రికెటర్ చిక్కుకున్నారు. దీంతో ఆమె సభ్యత్వాన్ని ముంబై జింఖానా క్లబ్ రద్దు చేసింది. ప్రస్తుతం ఈ విషయం తెగ వైరల్ అవుతోంది. తన తండ్రి చేసిన తప్పుకు కూతురు శిక్ష అనుభవించాల్సి వచ్చిందని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. టీమిండియా మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ తండ్రి ఇవాన్.. జింఖాన్ క్లబ్ ప్రెసిడెన్షియల్ హాల్లో మతమార్పిడిలను ప్రోత్సహించారు.

బ్రదర్ మాన్యుయెల్ మినిస్ట్రీస్ తరపున ఆయన 35 ఈవెంట్లు నిర్వహించినట్లు క్లబ్ మెంబర్ శివ మల్హోత్రా తెలిపారు. ఈ నేపథ్యంలోనే తండ్రి చర్యలకు కూతురి సభ్యత్వం రద్దు చేశారని చర్చ జరుగుతోంది. దేశంలో పెద్ద ఎత్తున మతమార్పిడులకు కొన్ని మిషనరీస్ పనిచేస్తున్నట్లు గతంలోనూ పలు నివేదికలు వెల్లడించాయి. ‘ దేశవ్యాప్తంగా కన్వర్షన్స్ గురించి మనకు తెలిసిందే. ఇప్పుడిది మా వద్దే జరిగింది. క్లబ్‌లో ఇలాంటివి నిషేధం’ అని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news