అహ్మదాబాద్ చేరుకున్న టీమిండియా

-

స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై , రెండో మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్‌పై భారత జట్టు ఘన విజయం సాధించింది. ఇక ఈ శనివారం అసలు సిసలు సమరానికి సిద్ధమవుతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వేదికగా పాకిస్థాన్‌తో శనివారం టీమిండియా తలపడబోతోంది. అయితే.. యావత్ క్రికెట్ ప్రపంచం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీమిండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్ ఈ నెల 14న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.

ఈ మ్యాచ్ కోసం పాకిస్థాన్ జట్టు ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకుని ప్రాక్టీసు మొదలుపెట్టింది. కాగా, నిన్న ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ లో గెలిచిన టీమిండియా నేడు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకుంది. విమానాశ్రయం నుంచి భారత ఆటగాళ్ల బృందం నేరుగా తమకు కేటాయించిన హోటల్ కు వెళ్లిపోయింది. ఈ సాయంత్రం నుంచి భారత్ ప్రాక్టీసు షురూ కానుంది. అటు, శ్రీలంకపై భారీ లక్ష్యాన్ని ఛేదించి సమరోత్సాహంతో ఉన్న పాక్… ఇటు వరుసగా రెండు మ్యాచ్ లలో నెగ్గి సొంతగడ్డ ఆధిపత్యాన్ని నిరూపించుకున్న భారత్ మధ్య హోరాహోరీ పోరు తప్పదని క్రికెట్ పండితులు భావిస్తున్నారు. టాస్ చాలా కీలకంగా మారే అవకాశాలున్నాయన్నది క్రికెట్ విశ్లేషకుల మాట.

Read more RELATED
Recommended to you

Exit mobile version