ICC ODI Rankings : కివీస్‌ క్లీన్ స్వీప్.. టీమిండియాదే అగ్రస్థానం

-

టీమిండియా మరో విజయం సాధించింది. న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో భారత్ 90 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో వన్డే సిరీస్ ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. న్యూజిలాండ్ తో 3 వన్డేల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా 114 రేటింగ్ పాయింట్స్ తో టాప్ ప్లేస్ కు చేరింది.

మంగళవారం జరిగిన ఆఖరి వన్డేలో సమిష్టిగా రాణించిన టీమిండియా 90 పరుగులతో న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ కు ముందు 112 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న భారత్, తాజా విజయంతో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకొని రెండు స్థానాలను ఏకబాకింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ ను వెనక్కు నెట్టింది. మూడు మ్యాచ్ ల్లో ఓడిన న్యూజిలాండ్ 111 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version