ఎంతో పటిష్టమైన న్యూజిలాండ్ జట్టును టీమిండియా వైట్ వాష్ చేసింది. కోల్ కత్త లో ని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మూడో టీ ట్వంటి లో టీమిండియా 73 పరుగులతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. 185 పరుగుల భారీ లక్ష్యం తో బరి లోకి దిగిన న్యూజిలాండ్ కు ఆది లో నే షాక్ తగిలింది. ఓపెనర్ డారిల్ మిచెలను తో పాటు మరో బ్యాటర్ మార్క్ చాప్మెన్ ఒకే ఓవరో అక్షర్ పటేల్ అవుట్ చేశాడు.
అలాగు అక్షర్ తన తర్వాతి ఓవర్ లో గ్టేన్ ఫిలిప్స్ ను కూడా అవుట్ చేశాడు. దీంతో 30 పరుగుల వద్దే 3 వికెట్లు ను కివిస్ కొల్పోయింది. కానీ మరో ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 51 (36) దాటిగా ఆడాడు. ఒక పక్క వికెట్లు పడుతున్న గప్టిల్ మాత్రం భారీ షాట్లతో అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అయితే న్యూజిలాండ్ నుంచి మార్టిన్ గప్టిల్ మినిహా ఎవరూ కూడా అంత గా రాణించ లేదు. దీంతో 111 పరుగుల కే కివిస్ అల్ అవుట్ అయింది. భారత బౌలర్లు అక్షర్ 3 వికెట్ల తీసి న్యూజిలాండ్ ఓటమి ప్రధాన కారకుడు అయ్యాడు. అలాగే యంగ్ హీరో హర్షల్ పటేల్ 2 వికెట్లు తీశాడు. అలాగే దీపక్ చాహర్, చాహాల్, వెంకటేష్ అయ్యార్ తల ఒక వికెట్ తీశారు. మూడు వికెట్లు తీసిన అక్షర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అలాగే ఈ సిరిస్ లో 53 సగటు తో 159 పరుగులు చేసి సిరిస్ లోనే టాప్ స్కోరర్ గా ఉన్నాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ కు మ్యాన్ ఆఫ్ ది సిరిసి అవార్డు లభించింది.