కొడుకు తెల్లగా, అందంగా పుట్టాడని భార్యను వేధించదు ఓ టెక్కీ.. దింతో ఉరి వేసుకొని భార్య సూసైడ్ చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన లక్ష్మీ ప్రసన్న(29)కు, వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామానికి చెందిన తిరుపతికి రెండేళ్ల కిందట వివాహం అయింది. ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు.. ఏడాది కిందట వీరికి కొడుకు పుట్టాడు.

అయితే తిరుపతి, లక్ష్మి ప్రసన్న చామనచాయ రంగులో ఉంటే కొడుకు తెల్లగా, అందంగా పుట్టాడని అనుమానం పెంచుకొని తిరుపతి భార్యను నిత్యం వేధించేవాడు.. దీంతో లక్ష్మీ ప్రసన్న ఉద్యోగం కూడా మానేసి ఇంట్లోనే ఉండేది. ఇక తీవ్ర వేధింపులకు గురైన లక్ష్మీ ప్రసన్న ఇంట్లో ఉన్న అద్దంపై ‘అమ్మా నాన్న నాకు బతకాలని లేదు. నా కొడుకు జాగ్రత్త. ప్లీజ్ వాళ్లకు మాత్రం నా బాబును ఇవ్వకండి’ అని రాసి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది