TPCC ప్రచార కమిటీ కన్వీనర్‌గా తీన్మార్ మల్లన్న

-

Teen mar Mallanna : ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ లో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మధుయాష్కి గౌడ్ చైర్మన్ గా ఉన్న టిపిసిసి ప్రచార కమిటీలో కన్వీనర్ గా తీన్మార్ మల్లన్నని నియమిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటారు.

Theenmar Mallanna as the convener of TPCC campaign committee

ఇది ఇలా ఉండగా.. కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. స్థానిక రైల్వే స్టేషన్ నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు బైక్ ర్యాలీగా వెళ్లి మధ్యాహ్నం 1:30కు నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేస్తారు. అనంతరం మూడు గంటలకు ఇందిరా గాంధీ స్టేడియంలో జరగనున్న సభకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో కలిసి హాజరవుతారు. ఇక్కడే బీసీ డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version