అమరవీరుల తల్లిదండ్రులతో కేసీఆర్ ను కొట్టిస్తా : తీన్మార్ మల్లన్న

-

ఇవాళ బిజేపి పార్టీ లో “తీన్మార్” మల్లన్న చేరారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ పై తీన్మార్ మల్లన్న నిప్పులు చెరిగారు. తాను తీసుకున్నది బిజేపి సభ్యత్వ రసీదు కాదని.. 15 మీటర్ల తాడు…ఈ తాడుతో తెలంగాణ అమరవీరుల స్థూపనికి కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ రావును కట్టేస్తానని హెచ్చరించారు. అమర వీరుల తల్లిదండ్రులను పిలిచి కొరదాతో కొట్టిస్తానని వార్నింగ్ ఇచ్చారు తీన్మార్ మల్లన్న.

ప్రపంచంలో అత్యంత మోసకారి కేసిఆర్ అని.. ప్రశ్నించే నాటికి నేను ఒక్కడినే… ఇప్పుడు చాలా గొంతుకలు ఉన్నాయని తెలిపారు. తాడు తీసుకొచ్చేందుకే ఢిల్లీ వచ్చానని.. తనపై 38 కేసులు పెట్టారు… వాటితో కెసిఆర్ ఎం సాధించారు ? అని నిలదీశారు. పోలీసులు బాధపడ్డారని… జడ్జీలు మదన పడ్డారన్నారు. బీజేపీలోకి వెళ్లే అవకాశం నాకు దక్కిందని.. ప్రజలలోకి వెళ్లి కెసిఆర్ పై పోరాడుతామన్నారు.సమాజంలోని ఉద్యమ కారులంతా ఒకటవుతున్నారన్నారు తీన్మార్” మల్లన్న. తెలంగాణ‌లో బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతుంద‌ని స్ప‌ష్టం చేశారు తీన్మార్ మ‌ల్ల‌న్న‌

Read more RELATED
Recommended to you

Exit mobile version