తెలంగాణ రైతులకు కేసీఆర్ సలహా..!

-

తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుండి బాయిల్డ్ రైస్ ను కొనమని ఎఫ్ సీ ఐ చెబుతున్నట్టు కేసీఆర్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో నే యాసంగి నుండి వరి పంట వేయవద్దని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఐదేళ్లకు సరిపడా ధాన్యం నిలువలు తమ వద్ద ఉన్నాయని మళ్ళీ కేజీ రైస్ కూడా కొనమని కేంద్రం చెప్పిందని కేసీఆర్ అధికారులకు తెలిపారు.

cm kcr | సీఎం కేసీఆర్

కాబట్టి యాసంగి లో శనగ, నువ్వులు, మినుములు, పెసర్లు, అవాలు, పొద్దు తిరుగుడు, ఆముదం, కూరగాయలు లాంటి పంటలను పండించాలని స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే తెలంగాణ లో ఆదాయం పెంచే పంటలు పడించాలని ప్రభుత్వం రైతులకు సూచిస్తూ వస్తోంది. అంతే కాకుండా లక్షల ఎకరాల్లో పామ్ ఆయిల్ పంటను పండించాలని దాంతో రైతులకు ఆదాయం పెరుగుతుందని పేర్కొంది. ఇప్పుడు వరి నిల్వలు ఎక్కువ అయినందున ప్రత్యామ్నాయ పంటలు పండించి రైతు ఆదాయం పెంచేలా సూచనలు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version