తెలంగాణ గవర్నర్ తమిలి సై సంచలన ప్రకటన చేశారు. నిజాం నుండి విమోచనం పొందిన దినోత్సవమన్నారు. సెప్టెంబర్ 17th విమోచన దినంగా చేసుకోవాలి అని పేర్కొన్నారు. త్యాగాల స్మరించుకోవాల్సిన దినం అని….తెలంగాణ ప్రజల పై జరిగిన అట్రాసిటీ లను మర్చిపోలేమని వెల్లడించారు.
తెలంగాణ ప్రజలు చరిత్ర తెలుసుకోవాలని కోరారు తెలంగాణ గవర్నర్ తమిలి సై. కేంద్ర ప్రభుత్వ అధ్వర్యంలో లో హైదరాబాద్ విమోచన ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 17 న ఏడాది పాటు జరిగే ఉత్సవాలను ప్రారంభించనున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా…ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర, కర్ణాటక సీఎం లు కూడా హాజరు కానున్నారు. ఈ మేరకు పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు…చేస్తోంది బిజెపి.
అలాగే హైదరాబాద్ విమోచన ఉద్యమ ఘట్టాలు, ఉద్యమం లో పాల్గొన్న వారి పై పోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వ కమ్యునికేషన్ విభాగం. అయితే ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించారు గవర్నర్ తమిళ్ సై. ఈ సందర్భంగా :సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా చేసుకోవాలి.. నిజాం నుండి విమోచనం పొందిన దినోత్సవం అని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పేర్కొన్నారు.